ఆర్యవైశ్యులకు వన్నె తెఛ్చిన వాసవిమాత ముద్దుబిడ్డ, ధిరోదాత్తుడు, అమిత పరాక్రమశాలి చైనా సైనికులతో ఎదురొడ్డి పోరాడి వీర మరణం పొందిన కల్నల్ బికుమళ్ళ సంతోష్ బాబు గారి సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి రామ్ నాద్ కొవింద్ గారు మరణాంతర మహా వీర్ చక్ర ప్రదానం చేశారు. ఈ అవార్డును సంతోష్ బాబు భార్య సంతోషి మరియు వారి మాతృమూర్తి అందుకున్నారు. ఆర్యవైశ్యుడిగా వారు దేశానికి చేసిన సేవ మరువ రానిది వారి ధైర్యం యువత కు స్ఫూర్తి దాయకం. తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ వారి సేవలను కొనియాడుతూ వారి ప్రాణత్యాగానికి నివాళులర్పిస్తున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి