"ముఖాముఖి మరియు ఆత్మీయ సన్మాన కార్యక్రమము”


కార్యక్రమం అంతా వీడియోలో


తేది 25.11.2020 రోజున వర్చువల్ "ముఖాముఖి మరియు ఆత్మీయ సన్మాన కార్యక్రమము” ను అఖిల భారత ఫెడరేషన్ ఆఫ్ అవోపాస్ వారు విజయవంతంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమము ఇటీవల వైశ్య సోదరులకు తెలంగాణ ప్రభుత్వము శాసనమండలి సభ్యుడిగా శ్రీ బొగ్గవరపు దయానంద్ గుప్తా గారిని, తెలంగాణా రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ గా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారిని మరియు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారలను నియమించిన సందర్భముగా అధ్యక్షుడు శ్రీ బెల్లి శ్రీధర్ గారు తన అధ్యక్షతన వారలను జూమ్ అనువర్తనము ద్వారా సన్మానింప దలచి ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా శ్రీ కోలేటి దామోదర్ గారిని మరియు నిజామాబాదు శాసన సభ్యుడు శ్రీ బిగాల గణేశ్ గుప్తా గా రలను, ఆహ్వాన కమిటీ చైర్మన్ గా సీనియర్ వైస్ ప్రెసిడెంటు కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారిని నియమించి వారిని సన్మానించుటకు తాజ్ డెక్కన్లో వేది కను ఏర్పాటుచేసి పరిమిత సంఖ్యలో ఆహూతులను సన్మానము చేయడానికి శ్రీ వంకదారి సోమశేఖర్, గోండల రాంబాబు మరియు సాంకేతిక సహకారం అం దించడానికి శ్రీ గ్రంధి రమేశ్ గారిని, నియమించి సుమారు 500 మంది జూమ్ వీడియో అనువర్తనము ద్వారా వీక్షించుటకు మరియు ముఖ్యులు అభినందన లు వర్చువల్ గా తెలపడానికి ఏర్పాట్లు చేసినారు.


కార్యక్రమము సరిగ్గా సాయంత్రము 7 గంటలకు శ్రీకోలేటి దామోదర్ గారు హాజరు కాగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీచింతల శ్రీనివాస్ గారి వాసవీ మాత ప్రార్థనతో మొదలయినది. తాజ్ దక్కన్కు శ్రీ బొగ్గవరపు దయానంద్ గుప్త గారు మరియు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణగారు రాలేక వారి వారి ఇండ్లలో నుండే సన్మాన కార్యక్రమములో పాల్గొన్నారు. శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు సతీసమేతంగా ట్రాఫిక్ లో చిక్కుకుని కాస్త ఆలస్యంగా హాజరైనారు. నేషనల్ ప్రెసిడెంటు శ్రీ బెల్డి శ్రీధర్ గారు చేసిన స్వాగత అధ్యక్షోపన్యాసము లో ముగ్గురు సన్మానితులతో మరియు ముఖ్య అతిథి గారితో తనకున్న అనుబంధంగురించి వివరించుచూ శ్రీ బొగ్గారపు దయానంద్ గుప్తా గారి తో తనకు మూడుపదుల సాన్నిహిత్యం వుందని వారితో కలసి పనిచేశాననీ, వారు చాలా సేవా గుణ సంపన్నులని, వా రికి సేవా కార్యక్రమాలపై ఆసక్తి కలదని ప్రతి సేవా కార్యక్రమములో ముందుంటారనీ వారికి శాసనమండలి సభ్యత్వం వరించడం చాలా గొప్ప విషయవ ని వారు చాలా మందికి సేవజేయు అవకాశం కలిగిందని దానిని వారు చక్కగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నానని చెబుతూ వారికి అభినందనలు తెలిపా రు. తదుపరి శ్రీ ఉప్పల శ్రీనివాస్ చాలా గట్టి వాడని, గట్టిగా మాట్లాడగలడని, గజ్జెకట్టి పాట పాడగలడని వారు ఐ.వి.ఎఫ్ లొ చాలా ప్రాయోజిత కార్యక్రమాల ను చేయుచున్నారనీ, వారితో 20 సంవత్సరాలు కలిసి పనిచేసే భాగ్యం కలిగిందని వారు ఐ.వి.ఎఫ్ లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు తాను కోశాధికారిగా పనిచేశాననీ, వారు సేవా దురంధరుడని, వారి సేవా నిరతికి శ్రీ కె.సి.ఆర్ గారు అబ్బురపడి రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ గా నియమించారని, వారు ఈ పదవి కి వన్నె తేగలడని అందుకు వారు సమర్థుడని వారు నూతన పదవిలో రాణించాలని పదిమందికి సేవ చేయాలని అభిప్రాయపడుచున్నానని తెలుపుతూ వారికి అభినందనలు తెలియజేశారు. శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడుచూ వారితో తనకు 20 సంవత్సరాల అనుబంధము కలదని వారు చాలా సేవా తత్పరులని, వైశ్యులకు సేవజేయడమే వారికి పరమావధి అని కొనియాడుచూ నూతన పదవిలో తాను రాణించాలని ఇతోధిక సేవ చేయాలని ఆభిలషిస్తూ అభినందనలు తెలిపుతూ సన్మానితులను సభకు పరిచయము చేశారు. ఆహ్వాన కమిటీ చైర్మన్ శ్రీచింతల శ్రీనివాస్ గారు సమావేశ అవశ్యకత మరియు తీరు తెన్నుల గురించి వివరించుచూ ఈ రోజు తలపెట్టిన ఆర్యవైశ్య ముగ్గురు సేవా దురంధరులు జాతికి వన్నె తెచ్చిన వారనీ, వారికి చేయు వర్చువల్ సన్మాన కార్య కమము ఇదివరలో ఎవ్వరూ చేయనటువంటిదనీ, ఈ రోజు ముఖ్య అతిథి శ్రీ కోలేటి దామోదర్ ఒక రాజకీయ శక్తి అనీ, వైశ్య సమాజానికి ఒక ఐడెంటిటీ తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అనీ, అనుక్షణం, అనునిత్యం ప్రజాసేవలో మమేకమైన ఒక గొప్ప మహానుభావుడని మన ఈ ముగ్గురు నక్షత్రాలకు పదవి వరించుటలో వారి పాత్ర గొప్పదనీ, వారు సేవా విత్తనం నాటి, మొలకింపజేసి, పెంచి, పోషించి, మహా వృక్షాన్ని గావించి ఆ వృక్ష ఛాయలో ఏందరికో నీడ కల్పిం చి ఈ రోజున ఈ ముగ్గురు వైశ్య రత్నాలకు పదవులు వరించడానికి కారణభూతమైనదని కొనియాడారు. ఈ రోజు కార్యక్రమములో పాలు పంచుకుంటున్న సేవా సంస్థలైన తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా హైదరాబాదు, వైస్ప్రో, వామ్ గ్లోబల్ లిటరరీ ఫోరమ్, వాసవీ క్లబ్స్ ఇంటర్ నేషనల్, బ్యాంకుమన్ ఛాపుటార్ అవోపా, ఫస్ట్ వైశ్య, అంద్రప్రదేశ్ రాష్ట్ర అవోపా, వాసవీ క్లబ్స్ హైదరాబాదు, అవోపానగర్ అమీన్ పూర్ తదితర సంస్థల అధిపతులు వర్చువల్ గా ఈ సమావే శానికి హాజరౌతున్న ఈ కార్యక్రమము అధ్భుతం, అమోఘం, అద్వితీయం, వర్ణనాతీతం అని కవిరత్న గారు తన సహజ శైలిలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ మన్ చాపుటార్ వారు సాంకేతిక సహాయము అందించారనీ, సంకేతికంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడానికి శ్రీ వంకదారి సోమశేఖర్ గారు శ్రీ గ్రంధి రమేశ్ గారు, తాను గత 2 వారాలుగా శ్రమించామనీ, మన వైశ్య సామాజిక వర్గానికి ప్రాముఖ్యత కల్పించి పలు పదవులు నొసంగిన శ్రీ కే.సి.ఆర్, శ్రీ కె.టి . ఆర్ గారలకు ఈ సభా ముఖంగా ధన్యవాదాలు తెలుపుచున్నామనీ, మనల్ని ఇంకా ప్రోత్సహించాలనీ మేము వారికెపుడూ తోడూనీడగా వుంటామనీ ఈ సభా ముఖంగా తెలియజేయు చున్నామని పేర్కొన్నారు. ఇది ఒక పండగ అనీ, వైశ్యజాతి గర్వించదగ్గ గొప్ప సందర్భమనీ ప్రాజెక్టు చైర్మన్ తెలుపుతూ తన ఈ సంక్షిప్త నివేదికను సభకు సమర్పించు చున్నా నన్నారు. ఈ రోజు సన్మానితులలో ఒకరైన హైదరాబాద్ వాస్తవ్యులు, వాసవి సేవా కేంద్రం హైదరాబాద్ పూర్వాధ్యక్షులు మరియు శాశ్వత సలహాదారు, ప్రముఖ వాసవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కాచిగూడ వైశ్య హాస్టల్, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ ఫౌండర్ మెంబర్, హైదరాబాద్ కొత్తపేట, శ్రీ శ్రీ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శాశ్వత ధర్మకర్తలు మరియు FAI శాశ్వత సభ్యుడు అయిన శ్రీ బొగ్గవరపు దయానంద్ గుప్తా ఎమ్.ఎల్.సి గారిని ఆడియో వీడియో విజువల్స్ తో పరిచయంచేయగా వర్చువల్ గా అవొపా బ్యాంక్ మన్ చాపుటర్ అధ్యక్షుడు శ్రీ పి.వి రమణయ్య గారు శాలువాతో బుకేతో సన్మానించారు. శ్రీ వంకదారి సోవ శేఖర్ సన్మానపత్రాన్ని చదివివినిపించారు. సన్మానంతరము శ్రీ దయానంద్ గారు మాట్లాడుచూ కోవిద్ లాక్ డౌన్ సమయంలో అన్నార్తులకు రోజూ 4000 అ హార పొట్లాలు, విలేఖరులకు ఇతరులకు కిరాణా సామానులు వగైరా వాసవీ సేవా కేంద్రము ద్వారా తెలంగాణ రాష్ట్ర అవొపా భాగస్వామ్యముతో సరఫరా చేశామనీ వలసకూలీలను, చిల్లర వ్యాపారులను ఆదుకున్నామని విన్నవించారు. ఇప్పుడు జరుగుచున్న హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. తదుపరి ఆహూతులకు అభినందనలు తెలుపవలసినదిగా ప్రథమంగా శ్రీ బండారు సుబ్బారావు గారిని కోరగా వారు తమ అభినందన సందేశాన్ని తెలిపారు. తదుపరి తెలంగాణ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారు శాసన మండలి సభ్యుడిగా నియమితుడైన శ్రీ బొగ్గవరపు దయానంద్ గుప్తా గారికి, తెలంగాణా రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ గా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గారలకు తన హృదయపూర్వక అభినందన లు తెలియజేయుచూ, ఈ ముగ్గురికి పదవులు రావడానికి సూత్రదారి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ కోలేటి దామోదర్ గారికి వందనములు సమర్పిస్తూ వర్చువల్ గా ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అఖిలభారత అవోపాల ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ బెల్టి శ్రీదర్ గారిని మరియు తక్కువ సమయంలో ఇంత ఘనంగా ఏర్పాట్లు గావించిన ఆహ్వాన సంఘం చైర్మన్ శ్రీ చింతల శ్రీనివాస్ గారలను ప్రత్యేకించి అభినందించారు.


తదుపరి తెలంగాణ స్టేట్ టూరిజమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్య వైశ్య ముద్దు బిడ్డ, ప్రముఖ సేవాతత్పరులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూ ఢిల్లీ ఫౌండర్ మెంబర్, IVF సౌత్ ఇండియా సెక్రటరీజనరల్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, IVF తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, వాసవి హాస్పిటల్ కోశాధికారి శ్రీ ఉ ప్పల శ్రీనివాస్ గారిని వారు చేసిన ప్రాయోజిత కార్యక్రమాలను, లాక్ట్రాన్ సమయంలో సుమారు 5 లక్షల మందికి అన్నదాన కార్యక్రమము నిర్వహించిన వీడి యోలతొ మరియు ఎన్నోఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేసిన విజువల్స్ తో బహు చక్కగా పరిచయం చేశారు. వారిని శ్రీ కోలేటి దామోదర్ గారు శాలువాతో బుకేతో మరియు సన్మానపత్రంతో సన్మానించారు.సన్మాన పత్రాన్ని శ్రీ చింతల శ్రీనివాస్ గారు అద్భుతంగా చదివి వినిపించగా ఆలపాటి ప్రవీణ్ గారు వారికి బుకే అందించారు. తదుపరి మలిపెద్ది శంకర్, నిజాం వెంకటేశం, నమశ్శివాయ తదితరులు అభినందన సందేశాలు విన్నవించారు. పిదప సన్మానితుడు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు మాట్లాడుచూ తాను శ్రీధర్ గారితో పనిచేశానని వారు చెప్పినటుల ఎన్నో సేవా కార్యక్రమాల్లో చాలా మంది ప్రముఖులతో పాలు పంచుకున్నా నని వాసవీమాత దయవలన వైశ్యజాతికి సేవ జేయు భాగ్యము కలిగిందనీ, మీ అందరి ఆదరాభిమానం, అశీర్వాదం వల్లనే తనకు ఈ పదవిని ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ ఇంకా చాలా మందికి సేవ చేయుటకు కట్టబెట్టారనీ అందులకు వారికి మరియు శ్రీ కె.టి.ఆర్ గారలకు రుణపడి వుంటానని కృతజతలు తెలుపుతూ టూరిజం కార్పొరేషన్ ద్వారా తాను అందరికి సహాయపడుతాననీ, హరిత హెటెల్ లో అకామడేషన్ చేపిస్తాననీ ఎవ్వరికి ఏ ఇబ్బంది ఎదురైనా తనను సప్రదించ వచ్చనీ తెలియబరచుచూ జరుగుచున్న హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనీ అలా మన కృతజతను చాటుకుందామని పిలుపు నిచ్చారు. తరువాత అభినందనలు బెంగుళూరు నుండి బెంగుళూరు అవోపా అధ్యక్షుడు శ్రీ రాజేంద్రప్రసాద్ గారు, కిట్టు గారు అళ్ఫా నరేశ్ గారు హైదరాబాదు నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ విజయ్ కుమార్ గుప్తా గారు వారి అభినందన సందేశాలను అందజేశారు.


తరువాత ఇంకొక ఆర్యవైశ్య లెజెండ్, సన్మానితుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చై ర్మన్ శ్రీ అమరవాది లక్ష్మి నారాయణ గారిని వీడియో విజువల్స్ తో పరిచయంచేయగా వారి సన్మాన పత్రాన్ని శ్రీ గ్రంధి రమేశ్ గారుచదివి వినిపించారు. వారిని వర్చువల్ బుకెతో మరియు శాలువాతో సన్మానించారు. తదుపరి సన్మానితుడు మాట్లాడుచూ తనకు ఈ పదవి కట్టబెట్టిన శ్రీ కె.సి.ఆర్ మరియు శ్రీ కె.టి. ఆర్ గారలకు కృతజతలు తెలుపుతూ జరుగుచున్న హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు నిచ్చారు.. పిదప బ్యాంకుమన్ చాపుటర్ శ్రీటి.ఎల్.వి.రావు, ఉమ్మడి తెలుగు రాష్ట్ర పూర్వాధ్యక్షుడు శ్రీ పోకల చందర్ గారు, ఎల్లూరి నరేద్రకుమార్ గారు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్య బాబు గారు సన్మానితులకు అభినందనలు తెలిపారు. ఈ రోజటి కార్యక్ర మానికి ముఖ్య అతిథి శ్రీ కోలేటి దామోదర్ గారు మాట్లాడుతూ మిరిచ్చిన వినతిపత్రం ను తప్పకుండా సి.ఎం దృష్టి కి తీసులెళ్తానని వైశ్య జాతికి 10% ఈ.బి.సి రిజర్వేషన్స్ మరియు వైశ్య కార్పొరేషన్ రావడానికి కృషి చేస్తానని తెలిపారు. గత 73 సెంవత్సరాలలో ఏ ప్రభుత్వం వైశ్య జాతికి చేయని పనులు టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిందని 11 మున్సిపల్ చేర్మన్ పఫవులను, 5 వైస్ చైర్మన్ పదవులను, వరంగల్ కు మేయర్ పదవిని, 5 మార్కెట్ చైర్మన్ పదవులను ఇంకెన్నో కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చారని కావున ఈ జి.హెచ్.ఎం.సి ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీ కి ఓట్లు వేయాలని అన్ని ఆర్యవైశ్య సంఘాలు సంఘటితంగా 27 వ తేదీన ప్లాజాలో జరిగే సన్మాన కార్యక్రమానికి అందరూ రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నూతన పంథాలో వినూత్నంగా నిర్వహించిన నేషనల్ అధ్యక్షుడిని వారి టీంను అభినందించారు. ఇది ఎంతో హర్షనీయం. అన్ని సంస్థ ల నుండి ప్రశంసలు అందుకున్న "ముఖాముఖి మరియు ఆత్మీయ సన్మాన కార్యక్రమము” ఒక చరిత్ర సృష్టించింది. కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారి సన్మాన పత్రాల రచన, పదజాలము, పఠనము అందరి ప్రశంసలనందుకుంది. ఈ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవోపా పక్షాన శ్రీ గంజి స్వరాజ్యబాబు మ రియు అవోపా న్యూస్ బులెటిన్ పక్షాన ఎడిటర్ నూకా యాదగిరి శుభాభినందనలు తెలియజేయుచున్నారు. వైస్ప్రొ సమీ సంపత్ గారు వోట్ ఆఫ్ థాంక్స్ తెలియజేసిన తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమము ముగిసినది..


కామెంట్‌లు