అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ వారి ఆన్ లైన్ వధూవరుల పరిచయ కార్యక్రమము


అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ వారు తరచుగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. వైశ్య సమాజానికి అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ శ్రీ వాసవీ మ్యాట్రిమోని టెలిగ్రామ్ 200 మంది సభ్యులు గల సమూహం( గ్రూపు) ద్వారా అబ్బాయిల అమ్మాయిల సమాచారం పొందుపరిచి గత మూడు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. తద్వారా కొన్ని సంబంధములు కుదుర్చుకున్నారని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇళ్లకే పరిమితమై వధూ వరుల అన్వేషణ ఇబ్బందిగా మారిందని తలచి చాప్టర్ అద్యక్షులు శ్రీ పి. వి రమణయ్య గారి ఆలోచన మేరకు చాప్టర్ కార్యవర్గ సభ్యులతో ఆన్ లైన్ వివాహ పరిచయ కార్యక్రమంకు నెలరోజుల క్రితం రూపుదిద్దుకుని 80 మంది సభ్యులతో చేయాలనే ప్రణాళికతో సాగుతున్న తరుణంలో అనూహ్యమైన స్పందనతో 05.07.2020 ఆదివారం నాడు 49 మంది అమ్మాయిలు 58మంది అబ్బాయిలు మొత్తం 107మంది పాల్గొన్నారు. ఇందులో 11మంది NRIs మన రెండు తెలుగు రాష్ట్రాలే గాకుండా తమిళనాడు కర్నాటక హర్యానా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల వారు పాల్గొని విజయవంతం గావించినారు. అతి తక్కువ రుసుము (రూ. 1116) చెల్లించిన వీరందరికీ మళ్లీ జరిపే వివాహ పరిచయ వేదికకు ఉచితంగా పాల్గొనే సౌలభ్యం కూడా వుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు శ్రీ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథి V3 చానెల్ జ్యోతి ప్రజ్వలనచే ప్రారంభమై సాయంత్రం 5.30 గంటల వరకు అందరు సభ్యులు చురుకుగా పాల్గొన్నారు మరియు సంతోషం,సంతృప్తిని వ్యక్తం చేశారు. గంటకొక బహుమతి చొప్పున 9 బహుమతులు అందజేశారు. కొందరు సంప్రదింపులు జరుపుతున్నట్లు అవగతమవుతున్నది. అవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ వారు వైశ్య సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు ఇంకా సాగించాలని పలువురు కోరుతున్నారు. శ్రేయోభిలాషులు సర్వశ్రీ ఉప్పల్ శ్రీనివాస్, బెల్దె శ్రీధర్ నిజాం వెంకటేశం, RSV బదరీనాథ్, పోకల చందర్ ఆలపాటి మరియు చింతల శ్రీనివాస్ గార్లు ఆశీస్సులు తెలిపారు. సమన్వయ కర్తలుగా సర్వశ్రీ టి. నాగేశ్వరరావు VFE, పి. సురేంద్రనాధ్, గర్రె మురళి కృష్ణ, పి. ధనంజయరావ్, నూక యాదగిరి, జి యన్. ఆర్. మూర్తి,మద్ది హనుమంతరావు, ఆర్. మోహన్ దాస్, గ్రంధి రమేష్ (NRI list) అభ్యర్థులకు సమన్వయ పరిచినందుకు మరియు వ్యాఖ్యాతలు(Moderators) శ్రీమతి రాధాకిరణ్ చీకోటి, శ్రీమతి ఏ. సత్య భవాని మరియు కుమారి శ్రేయంస గ్రంధిగార్లు    వారి విధులు చక్కగా నిర్వహించారని, మరియు సాంకేతిక సహాయం అందిచిన సర్వశ్రీ  V. సోమశేఖర్, TLV Rao , గ్రంధి రమేష్ మరియు గుండా శ్రీనివాస్ గార్ల సహకారం అద్భుతంగా ఉందని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సహయ సహకారాలు అందించిన అందరికీ పేరుపేరునా     ధన్యవాదములు తెలుపుతూ  శ్రీ రామానందం గారు చాప్టర్ సెక్రటరీ వందన సమర్పణ చేశారు. 


                         


కామెంట్‌లు