రావికంటి రామయ్య గారిపై నిజాం వెంకటేశం గారి వ్యాసం

                                                                                                                     


తెలంగాణ రాష్ట్రంలోని అవిభక్త కరీంనగర్ జిల్లాలోని మంథని వాసి అయిన రావికంటి రామయ్య గారు సుప్రసిద్ధ కవులు. వారెన్నో కవితలు, గేయాలు కథలు, కథానికలు వ్రాసారు. పలువురి మన్ననలు, ప్రశంసలు, సత్కారాలు, బిరుదులు పొందారు.  ఆధునిక కవులలో రావికంటి వారిది అత్యుత్తమ సాహిత్యం. వీరు మంత్రికూట వేమనగా సాహితిపరులకు పరిచస్తులు.  వీరిపై తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం గారు వ్రాసిన నాలుగు పేజీల వ్యాసం వైశ్య వికాస వేదిక మాగ్జిన్లో  ప్రచురితమైనది. నిజం వెంకటేశం గారి వ్యాసంలో రామయ్య గారి వ్యక్తిత్వ శైలిని, రచనా మాధుర్యాన్ని కుటుంబ విశేషాల్ని చక్కగా వివరించారు. ఒక పేరొందిన వైశ్య కవిని చక్కగా పరిచయం చేసిన నిజం వెంకటేశం గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక్ష వర్గము అభినందనలు తెలుపు చున్నవి. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వారి వ్యాసాన్ని క్షుణ్ణంగా చదువు గలరు. 
రావికంటిపై నిజాం గారి వ్యాసం


కామెంట్‌లు