జర్నలిస్టు లకు సన్మానం

ఈరోజు జర్నలిస్టు డే సందర్భంగా వాసవి క్లబ్ కాటారం ఆధ్వర్యంలో 15 మంది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులను సన్మానించారు. మద్ది నవీన్ కుమార్ వాసవి క్లబ్ కాటారం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహాముత్తారం మండల అభివృద్ధి అధికారి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జర్నలిస్టులు సమయం సందర్భం లేకుండా పిల్లలు కుటుంబాన్ని కూడా పక్కనపెట్టి కొరకు తిరిగి ఎంతో కష్టపడతారని వారిని ఎవరు కూడా గుర్తించడం లేదని వాసవి క్లబ్ సభ్యులు గుర్తించి వారికి సన్మానించడం సంతోషదాయకం అని అన్నారు ఇటీవల కోవిద్ బారినపడి ఎంతో మంది విలేకరులు చనిపోవడం జరిగిందని వారి కుటుంబాలను ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బీరెల్లి రమేష్, కోశాధికారి దారం నందకిషోర్, జోన్ చైర్మన్ దారం నవీన్ కుమార్, జిల్లా ఇన్చార్జి పి ఆర్ ఓ అనంతుల రమేష్ బాబు, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనంతుల శ్రీనివాస్ ,జిల్లా గవర్నర్ కలకోట శ్రీనివాస్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ పవిత్రం శ్రీనివాస్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


కామెంట్‌లు