అభినందనలు


ఆవోప నాగర్ కర్నూల్ మాజీ అధ్యక్షులు లయన్ రాధాకృష్ణ లయన్స్ 320A మొదటి వైస్ గవర్నర్ గా తేది 9.8.2020 ఆదివారం సాయంత్రం జూమ్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ఇంటర్నేషనల్ డైరక్టరు రుమాల్ల సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసారు. మొదటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాధాకృష్ణ మాట్లాడుతూ వైస్ గవర్నర్ గా సమర్ధవంతంగా పనిచేసి గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరిగే విధంగా క్రృషి చేస్తానని తెలిపారు. వైస్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణ ను క్లబ్ సభ్యులు ,అవోపా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బిల్ల కంటి రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీను, జిల్లా ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్, నాగర్ కర్నూల్ యూనిట్ అధ్యక్షులు ఫణి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీధర్, రాష్ట్ర నాయకులు వాసా పాండురంగయ్య, సురేందర్, సాయి శంకర్, బొడ్డు పాండు. దర్శి రాజయ్య కందూరు బాలరాజు తదితరులు అభినందించారు.   


కామెంట్‌లు