JITO వారి కరోనా కేర్ సెంటర్జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ వారు 100 పడకల కరోన కేర్ సెంటర్ ను 55 సంవత్సరముల లోపు కరోనా పేషెంట్స్ కోసం ప్రారంభించారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో కారోనా వైద్యం సామాన్యునికి అందుబాటులో లేనందున JITO సంస్థ వారు అందరికి అందుబాటులో నుండునటుల ప్యాకేజీని తీర్చి దిద్దారు. ఈ ప్యాకేజీ లో వారం రోజులకు సరిపడా బేసిక్ కిట్, మందులు, భోజనం, ఉండుటకు వీలు కల్పించు చున్నారు. వీరు 5 అంతస్తుల హోటల్ మానసరోవర్ భవనాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చి మహావిర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సేవలందిస్తున్నారు. అడ్మిషన్స్ తేదీ 5.8.2020 నుండి ప్రారంభించెదరు. పై వీడియో లో అన్ని వివరములు ఇచ్చారు. వారిని టెలీఫోన్ ద్వారా 9221155500/ 9121255500/ 9122355500 గల నంబర్లలో సంప్రదించవచ్చును. కావున అవసరమున్నవారు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలంగాణ రాష్ట్ర అవొప మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారు కోరుచున్నారు. 


 


కామెంట్‌లు