పాజిటివ్ & నెగటివ్ ఆటిట్యూడ్ పై పోకల చందర్ గారి ప్రసంగం


విజయీభవ ట్రస్ట్ వారు నిర్వహించిన ఫేస్బుక్ లైవ్ లో "సానుకూల ఆలోచన" (Positive Thinking) అను అంశంపై ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్, కాకతీయ యూనివర్సిటీ సీనియర్ సెనెట్ మెంబెర్, లయన్స్ క్లబ్ క్వెస్ట్ గవర్నర్, పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అవొప ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు చేసిన ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. వారు (positive attitude) సానుకూల ఆలోచన అను అంశంపై ప్రస్తావించిన ఉదాహరణలు, ప్రపంచాధినేతల సరైన నిర్ణయాలు, ప్రసంగం రోజున గతంలో జరిగిన సంఘటనలు, ప్రముఖుల జన్మదినాలు ఒకటేమిటి ఎన్నో విషయాలు కూలంకషంగా వివరిస్తూ అశుకవిత్వంతో అలరిస్తూ హృదయానందంగా ప్రసంగాన్ని ఉరకలెత్తించారు. సంస్కృత శ్లోకాలనుదహరిస్తూ అర్థతాత్పర్యాలతో అనువదిస్తూ చేసిన 50 నిమిషాల ప్రసంగం పాజిటివ్ అట్టిట్యూడ్ వలన కలిగే లాభాల గురించే కాకుండా నెగటివ్ ఆట్టిట్యూడ్ వలన కలిగే నష్టాల గురించి కూడా సవివరంగా ఉదాహరణలతో వివరించారు. పాజిటివ్ అట్టిట్యూడ్ గురించి తెలియని విషయాలు తెలియబరచడమే కాకుండా దానినే అనుసరించాలనిపించే విధంగా ప్రసంగించి నందులకు పోకల చందర్ గారికి తెలంగాణ రాష్ట్ర ఆవోపా అధ్యక్ష కార్యదర్శులు వారి కమిటీ మరియు ఆవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియజేయు చూన్న వి. వీరు ఇలాంటి మరెన్నో ప్రసంగాలు చేయాలని తెలియని విషయాలు తెలియచెప్పాలని పలువురు అభిప్రాయ పడుచున్నారు.                     పోకల గారి ప్రసంగం


కామెంట్‌లు