నాగర్ కర్నూల్ వారు జూమ్ అనువర్తనం ద్వారా నిర్వహించిన సమావేశం


తేదీ 12.7.2020 రోజున నాగర్ కర్నూలు జిల్లా అవోపా అధ్యక్షుడు రవికుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పూర్వ మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని అవోపాల జూమ్ మీటింగ్ విజయవంతం అయింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూర్వ ఏ.పి అవోపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు, రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారు, రాష్ట్ర నాయకులు కలకొండ సూర్యనారాయణ గారు, కొండూరు రాజయ్య గారు, పోలా నర్సింహయ్య గారు పాల్గొన్నారు. నాగర్కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ ,గద్వాల్ జిల్లా అవోపాల అధ్యక్ష కార్యదర్శులు, ఆక్టివ్ మెంబర్స్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కల్వకుర్తి యూనిట్ అవోపాల అధ్యక్ష కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొని ఎజెండా లోని ముఖ్య అంశాలు అయిన ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక, covid 19 ప్రోగ్రామ్స్ లో భాగంగా ప్రైవేట్ పాఠశాల లో పని చేయుచున్నటువంటి ఆర్యవైశ్య ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు చేయూత, నూతన అవోపఆమోదించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికైన నూతన అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా బాధ్యులు అందరూ కూడా జూమ్ అనువర్తనం లోనే ప్రమాణ స్వీకారోత్సవాలను జరుపుకోవాలని సూచించడం జరిగింది. తమ తమ జిల్లాల కార్యవర్గ కమిటీని విస్తరించాలని కూడా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ అధ్యక్షులు ఫణి కుమార్ గారు, కార్యదర్శి సాయి శంకర్ గారు, బొడ్డు పాండు గారు, కె. సాయి శంకర్ గారు, అచ్చంపేట నుండి అవోపా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య గారు, ఆర్థిక కార్యదర్శి పాపి శెట్టి శ్రీనివాస్ గారు, వనపర్తి అధ్యక్షులు గుమ్మడవెల్లి భాస్కర్ గారు, శ్రీధర్ గారు వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులు ఎల్. శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు