నివాళి


సేవా మార్గానికి వయసుతో పనిలేదని నిరూపించిన వారు గరిమిల్ల అవోపా సలహాదారు డాక్టర్ మోటూరి నాగేశ్వరరావు గారు. ఏడు పదులు దాటినా ఎనలేని సేవలందించి హృద్రోగముతో నిర్యాణము చెందడము చాలా విచారకరము. వీరు ప్రైవేట్ ప్రాక్టీసుతో పాటు ఆర్.ట్.సి వైద్యాధికారిగా, ఎం.సి.సి కంపెనీ అధికారిక వైద్యునిగా, మంచిర్యాలలోని రెడ్క్రాస్ సొసైటీ డైరెక్టర్గా లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షునిగా, అనేక వైద్య శిబిరాలలో డాక్టర్ గా సేవలందించారు. గర్మిళ్ల వృద్ధాశ్రమానికి సలహాదారునిగా, వివేకవర్ధిని ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్.ఆర్.కె.ఎం కాలేజి సొసైటీ ల డైరెక్టర్ గా పనిచేసి విశేష సేవలందించారు. వీరు సేవలందించిన ప్రతీ చోట, ప్రతి ఒక్కరి మన్ననలను పొందారు. అందరిని ఆప్యాయతో పలకరించి వారి బాగోగులు తెలుసుకొని సహకరించడం వారి ప్రత్యేకత. వీరు లేని లోటు వారి కుటుంబ సభ్యులకే గాక మంచిర్యాల ప్రజలకే తీరని లోటు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారి ఆకస్మిక మరణానికి చింతిస్తూ, వారి ఆత్మ శివైక్యం నొందాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నారు.


కామెంట్‌లు