అశ్రునివాళి


నిన్న రాత్రి  లడ్డాక్ సమీపాన గాల్వాన్ వాలీ బార్డర్ లో భారత్ మరియు చైనా సేనలు సరిహద్దు వివాదంలో పరస్పర రాళ్ల దాడి, ముష్టి ఘాతాలతో తలపడగా 5 గురికి పైగా చైనా సైనికులు  చనిపోగా భారత్ తరపున 3 గురు చనిపోయారు. అందులో సూర్యాపేట నివాసి రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు పోకల చందర్ గారి బంధువు కల్నల్ శ్రీ బిక్కుమల్ల సంతోష్ బాబు గుప్త వీర మరణం పొందారు. కల్నల్ శ్రీ బిక్కుమల్ల సంతోష్ బాబు గుప్త గారు 6వ తరగతి నుండి కోరుకొండ సైనిక్ స్కూల్ లో తరువాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో, పిదప ఇండియన్ మిలటరీ అకాడమీ లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత ఉద్యోగం. మొత్తం 15 సంవత్సరాల సర్వీస్. సర్వీస్ మొత్తం కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, పాకిస్థాన్ బోర్డర్ లో, కొంత కాలం కాంగో దేశం లో  విధుల నిర్వహించారు. అన్ని చోట్లా మెడల్స్ సాధీంచాడు. 37 సంవత్సరాల పిన్న వయసులో కల్నల్ గా పదోన్నతి పొందాడు. ఇది ఒక రికార్డ్. 2007 లో  పాకిస్తాన్ బోర్డర్ లో ముగ్గురు చొరబాటు దారులను  అంతమొందించి దేశాన్ని కాపాడారు.సైన్యం లో మనవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో మన తెలుగు వారు ఇంకా అరుదు. కావున ఇంతటి ప్రతిభ కలిగిన ఆ వీరుడికి మన అశ్రునివాళితో వారి ఆత్మకు శాంతి చేకూర్చమని భగవంతుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయుచున్నవి.


15 జూన్ న ఏమి జరిగింది


 


కామెంట్‌లు