అవోపా హైదరాబాద్ వారి లాక్ డౌన్ టాక్స్


అవోపా హైదరాబాద్ వారు వారి సభ్యుల కోసం మరియు సాధారణ ప్రజల కోసం గత 2 వారాలుగా ఇంపాక్ట్ (శ్రీ గంపా నాగేశ్వర్ రావు గారు) సహాయంతో జూమ్ అనువర్తనం ద్వారా లాక్ డౌన్ టాక్స్ చేశారు.  ఈ కార్యక్రమాలు ప్రత్యేకమైనవి మరియు ప్రజలందరికీ సహాయ పడునటువంటివి.   15 రోజుల వ్యవధిలో 30 మంది ప్రముఖ వక్తలు తమ జీవిత సారాన్ని ఇంపాక్ట్ మరియు అవోపా హైదరాబాద్ యొక్క లాక్ డౌన్ సమయంలో అందించారు మరియు ఈ కార్యక్రమాలకు 15 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయి.  ఇది గొప్ప విజయం, నిజంగా చిరస్మరణీయ సిరీస్. ఇది అవోపా హైదరాబాద్ నకు గొప్ప సంతృప్తిని కలుగజేసింది అని అధ్యక్షుడు నమఃశివాయ గారు తెలియబరచుచూ  గంప నాగేశ్వర రావు  గారికి, రాజశేఖర్ గారికి మరియు స్పీకర్స్ చింతల శ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్, పెద్ధి శ్రీనివాస్, నిజాం వెంకటేశం, పోకల చందర్, సోమ మహేష్, సతీష్ కంతేటి, డాక్టర్ ఖాదర్ వలీ గారలకు మరియు ఇతర వక్తలకు, ఆఫీసు బేరర్లకు మరియు అవోప హైదరాబాద్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోలన్నింటినీ ఇంపాక్ట్ యొక్క యూట్యూబ్ లేదా అవోపా హైదరాబాద్ పేజీ www.Facebook.com/avopahyd లో చూడవచ్చు నన్నారు.


కామెంట్‌లు