అవోపా హనుమకొండ వారి ఆహార పంపిణీ


అవోపా హనుమకొండ వారు అన్నదాన కార్యక్రమము ప్రారంభించి నేటితో 48 రోజులు గడచినవి. ఈ రోజు అన్న దాతగా శ్రీరామ్ బిక్షపతి విజయలక్ష్మి కుటుంబం, వెలిశాల కమలాకర్ అనిల్ కుమార్ల తండ్రి వెలిశాల కేదారి జ్ఞాపకార్థం నిర్వహించడం జరిగినది. సుమారు 220 మందికి పైగా ఆహారం అందించడం జరిగినది. ఈ కార్యక్రమములో కల్లూరి శ్రీనివాస్,  అనంతుల కుమార స్వామి, చిదరా రాజశేఖర్, గుంటూరు వెంకట నారాయణ, దేవా మధుబాబు, తాటికొండ సుధాకర్,   ఐతా భాస్కర్, బచ్ఛు రమేశ్, అకినేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  ఈ రోజు కార్యక్రమ దాతలకు వాసవి మాత,  కరుణా కటాక్షాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నారు.


కామెంట్‌లు