VYSPRO వారి నిత్యావసర సరుకుల పంపిణి
 తేదీ 30.5.2020 రోజున   VYSPRO మరియు వైస్ ప్రో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుచున్న సుమారు 350 కి పైగా బీదలకు దాతల సహకారంతో, 2500/- రూపాయల విలువైన 25 కేజీల బియ్యం, 17 కేజీల ఉప్పు, పప్పులు, సబ్బులు, నూనె మొదలైన పచారీ దినుసులు ఒక్క నెలకు సరిపడా గ్రాసం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన శ్రీ యోగానంద్, మంజీర కన్ స్ట్రక్షన్స్ అధినేత శ్రీ శివకుమార్, విశ్వనాథ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అధినేత మరియు శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, సినీ నిర్మాత హాజరు అయ్యారు. Vyspro సంస్థ జాతి కుల మత వివక్ష లేకుండా ఈ సమయం లో ఇలా అందరికీ ఉపయోగపడే చేయూత అనే కార్యక్రమం చేపట్టడం చాలా మంచిది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు శ్రీ మధు మోహన్, రాచురి శ్రీనివాస రావు, గురురాజ్, శ్రీ రాజేశ్వర రావు, నరహరి చంద్ర శేఖర్, నారాయణ మూర్తి  సంకా , బచ్ఛు శ్రీనివాస్  మొదలైన సభ్యులు, శ్రీ బెల్డి శ్రీధర్ గారు అధ్యక్షులు - A I F A, శ్రీ దయాకర్ గెళ్లి, శ్రీ. సాంబశివరావు మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. తదుపరి తేదీ 31.5.2020 రోజున  వైస్ప్రొ వారి చేయూత కార్యక్రమములో బియ్యం, పప్పు, నూనె, డిటర్జెంట్స్, కూరగాయలు,  మరియు మాస్క్స్ 4 గురికి 30 రోజులకు  సరిపడు నిత్యావసర వస్తువులు సుమారు 350 మందికి పైగా పంపిణీ చేశారు.


కామెంట్‌లు