కొవ్వొత్తుల ర్యాలీ


తేదీ 18.6.2020 రోజున అవోపా జమ్మికుంట వారు కల్నల్ సంతోష్ కుమార్ తో సహా 20 మంది సైనికుల మృతికి సంతాపకంగా నివాళులర్పించారు. అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుచూ ఆ వీర సైనికుల బలిదానం ఊరికే పోదని భారత సైన్యం తప్పకుండా ప్రతీకారం తీసుకుంటుందని అన్నారు. అనంతరం వారల ఆత్మల శాంతికై వాసవీ మాత దేవాలయము నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సుధాకర్ గారితో బాటు ప్రధాన కార్యదర్శి బాదాం సురేష్ బాబు, ఆర్థిక కార్యదర్శి కేర్.ఆర్.వి.నర్సయ్య రాష్ట్ర బాధ్యులు, జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు