అవోపా హనుమకొండ వారిఆహార పంపిణి ముగింపు సమావేశం


తేదీ 7.6.2020 రోజున అవోపా హనుమకొండ వారు తమ 52 వ రోజు ఆహార పంపిణీ కార్యక్రమం లో ఉదయం 250 మంది మున్సిపాల్ కార్మికులు మరియు ఇతరులకు బలవర్ధకమైన ఆహారం, పండ్లు మరియు గుడ్లు పంపిణీ చేశారు.  తదుపరి అవోపా భవన్లో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ ముగింపు సమావేశంలో  వరంగల్ మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై 108 మంది కార్మికులకు దాల్, ఆయిల్, సబ్బులు, ఉప్పు, వెజిటబుల్స్ తో బియ్యం సంచులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు పోకల చందర్ మాట్లాడుచూ నిజంగా ఇది అధ్యక్షుడు ఎళ్ళెంకి రవీందర్ ​​నాయకత్వంలో అవోపా హనుమకొండ చేసిన గొప్ప సేవ అని ప్రశంసిస్తూ ఈ ఆహార పంపిణీ కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాతలందరికి  అభినందనలు తెలియజేసారు. ఈ 52 రోజుల ఆహార పంపిణీ కార్యక్రమంలో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఖర్చుతో 15 వేలకు పైగా పేద మున్సిపల్ కార్మికులకు మరియు ఇతరులకు ఆహారాన్ని  అందించారని, ఇది  అవోపా హనుమకొండ సభ్యులందరి సమీష్టి విజయమని కావున అందరికి హ్యాట్స్ ఆఫ్ అని  అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎళ్ళెంకి రవీందర్, జిఎస్ ప్రకాష్, టి.ఆర్.అప్పారావ్ మరియు ఇతర అంకితమైన అవోపాన్స్ పాల్గొన్నారు.కామెంట్‌లు