వి3 ఛానల్ ప్రారంభ గీతాన్ని కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు చాలా చక్కగా రచించారు. వీరి గీతానికి సమకూర్చిన మ్యూజిక్, లిరిక్స్ సూపర్. "వి3 న్యూస్ ఛానెల్ మన అందరి మైత్రి ఛానెల్...లక్ష్యం, సమాజ హితం, మా సంకల్పం...ప్రజా క్షేమం. సమాజ సేవే పరమార్థంగా ప్రజాదరణే ప్రభల బలంగా... మీకై నిలిచే మన ఛానెల్...వి3 న్యూస్ ఛానెల్.. మనందరి మైత్రి చానెల్" ఈ విధంగా గల గల పారే సెలయేరులా వి3 ఛానెల్ ఉద్దేశ్యాలను, కార్యాచరణను పాటలో పొందుపరిచిన విధానం అద్భుతం, అమోఘం. వింటూంటే వినాలన్పించే అద్భుత గానం, చూస్తుంటే చూడాలన్పించే అద్భుత గ్రాఫిక్స్ మనసుకు హాత్తు కునేలా ఎడిటింగ్. ఈ ప్రారంభ గీతం కవిరత్నగారి కీర్తి మకుటంలో మరో కలికి తురాయి అనుటలో సందేహం లేదు. వారికి తెలంగాణ రాశ్ట్ర ఆవోపా హృదయపూర్వక అభినందనలు, ప్రేమపూరిత ప్రశంసలు తెలియజే స్తూ, వారిలాగే అత్యద్భుత కవితలు వ్రాస్తూ ఉండాలనీ, ప్రజల మనసును చూరగొంటూ ఉండాలనీ సర్వదా ఆకాంక్షిస్తున్నవి.
- నూకా యాదగిరి,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి