అభినందనలు


లాక్డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా బీదలను, రోజువారీ కూలీలను, వలస కార్మికులను కడుపులో పెట్టుకుని సాదుకోమన్న నినాదంతో ఏకీభవించి మేమున్నాం వారికోసమని ఎన్నో ఎన్.జి.లోలు స్వచ్చంద సంస్థలన్నీ ముందుకొచ్చి సేవ లందిస్తున్నవి. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవోపా (ఆర్యవైశ్య ఆఫీ షియల్స్ & ప్రొఫెషనల్స్) సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా, తాలూకా, గ్రామాలలో ఎన్.జి.ఓలుగా రిజిస్టర్ అయ్యి సేవా కార్యక్రమాలు చేయుచున్న వారి అనుబంధ సంస్థలైన సుమారు 92 జిల్లా, టౌన్, యూనిట్ అవోపాలయిన అవోపా హైదరాబాద్, బ్యాంక్మెన్ చాపుటర్ హైద్రాబాద్, అవోపా హనుమకొండ, మంచిర్యాల, జనగామ, జమ్మికుంట, హుజురాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, కాగజ్ నగర్, లక్షేట్టిపెట్, కామారెడ్డి, మహబూబ్ నగర్, అచ్ఛంపెట్, నాగరకర్ణుల్, వనపర్తి, గద్వాల, కోదాడ, హుజుర్నగర్, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, మహబూబాబాద్, తొర్రుర్, భద్రాచలం, ఖమ్మం మొదలగు వారి ద్వారా ప్రతిరోజూ వేల రూపాయల ఖర్చుతో వేలాదివేల అన్నార్థులకు మరియు నిరంతరంగా అలుపెరుగక పని చేయుచున్న, పోలీస్ వారికి, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, జర్నలిస్టులకు, వలస కూలీలకు, రోజువారి వేతన కూలీలకు, బీదలకు, వయోవృధ్ధులకు, పూజారులకు, అనాథలకు, వికలాంగులకు, ఆటోరిక్షా వారికి, ట్రాన్సజెండర్స్ కు మరియు వివిధ బడుగు వర్గాల ప్రజానీకం ఆకలితో అలమటించక, పస్తులుండక దినచర్య కొనసాగించుటకు నిత్యావసర సరుకులను, ఆహార పదార్థాలను, కూరగాయలను రక్షణ పరమైన సానిటాయిజర్స్ ను, గ్లోవ్స్, మాస్కులు మొదలగు వాటిని పంపిణీ చేస్తూ "మానవ సేవయే మాధవ సేవ" అను స్పూర్తితో లాక్డౌన్ రోజునుండి సేవ చేస్తూ వారి దొడ్డ మనసును సేవా తత్పరతను చాటుకుంటున్నవి. మరిన్ని వివరాలకు మా గూగుల్ పేజీ  HTTPS://avopabulletin.page ని చూడండి. తెలంగాణ రాష్ట్రం మ్యాప్ లో చూపిన విధంగా రెడ్ స్పాట్లు జిల్లా, మండల స్థాయిలో సేవ చేయు చున్న అవొపాలు. కావున పైన పేర్కొనబడిన అవోపాల అధ్యక్ష కార్యదర్శులకు పేరు పేరునా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు