అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర‌్యవైశ‌్య ముద‌్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రథమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించి దిగ్విజయముగా నేటికి 43వ రోజు గడచినది. ఈ రోజు దాతలు (1) నెల‌్లుట‌్ల జగన‌్నాధ రావు (సీనియర్ అడ్వకేట్) - సంధ‌్యరాణి ల వివాహ వార్షికోత్సవ సందర్భంగా (2)నారసింహుల ఉపేందర్ - లావణ్య కుటుంబం. ( చందమామ స‌్వీట్స్, ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా, హన‌్మకొండ)(3)తాటిపెళ‌్ళి నాగేశ్వరరావు గారు కుటుంబం (వాసవీ ఫౌండేషన్ ఫర్ ఎంపవర్మెంట్ - హైదరాబాద్) గారల సహకారంతో ఈరోజు కార‌్యక్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక్రమంలోఅద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప్రకాశం, అనంతుల కుమారస్వామి, అల‌్లెంకి చంద్రశేఖర్, చిదరా రాజశేఖర్, తాటికొండ సుధాకర్, తాటికొండ సురేష్ కుమార్, దేవా మధుబాబు, అయితా భాస‌్కర్ రావు, తదితరులు పాల్గొని దాదాపు గా 240 మందికిపైగా ఆహారం అందించారు.ఈరోజు కార‌్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నారు..
అవొప హనుమకొండ వారి ఆహార పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి