రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు రాష్ట్ర అవోపా కృతజ్ఞతలు

లాక్డౌన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా బీదలను, రోజువారీ కూలీలను, వలస కార్మికులను కడుపులో పెట్టుకుని సాదుకోమన్న నినాదంతో ఏకీభవించి మేమున్నాం వారికోసమని ఎన్నో ఎన్.జి.లోలు స్వచ్చంద సంస్థలన్నీ ముందుకొచ్చి సేవ లందిస్తున్నవి. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవోపా (ఆర్య వైశ్య ఆఫీ షియల్స్ & ప్రొఫెషనల్స్) సూచనల మేరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా, తాలూకా, గ్రామాలలో ఎన్.జి.ఓలుగా రిజిస్టర్ అయ్యి సేవా కార్యక్రమాలు చేయుచున్న వారి అనుబంధ సంస్థలైన సుమారు 92 జిల్లా, టౌన్, యూనిట్ అవోపాలయిన అవోపా హైదరాబాద్, బ్యాంక్మెన్ చాపుటర్ హైద్రాబాద్, అవోపా హనుమకొండ, మంచిర్యాల, జనగామ, జమ్మికుంట, హుజురాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, కాగజ్ నగర్, లక్షేట్టిపెట్, కామారెడ్డి, మహబూబ్ నగర్, అచ్ఛంపెట్, నాగరకర్ణుల్, వనపర్తి, గద్వాల, కోదాడ, హుజుర్నగర్, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, మహబూబాబాద్, తొర్రుర్, భద్రాచలం, ఖమ్మం మొదలగు వారి ద్వారా ప్రతిరోజూ వేల రూపాయల ఖర్చుతో వేలాదివేల అన్నార్థులకు మరియు నిరంతరంగా అలుపెరుగక పని చేయుచున్న, పోలీస్ వారికి, వైద్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు, జర్నలిస్టులకు, వలస కూలీలకు, రోజువారి వేతన కూలీలకు, బీదలకు, వయోవృధ్ధులకు, పూజారులకు, అనాథలకు, వికలాంగులకు, ఆటోరిక్షా వారికి, ట్రాన్సజెండర్స్ కు మరియు వివిధ బడుగు వర్గాల ప్రజానీకం ఆకలితో అలమటించక, పస్తులుండక దినచర్య కొనసాగించుటకు నిత్యావసర సరుకులను, ఆహార పదార్థాలను, కూరగాయలను రక్షణ పరమైన సానిటాయిజర్స్ ను, గ్లోవ్స్, మాస్కులు మొదలగు వాటిని పంపిణీ చేస్తూ "మానవ సేవయే మాధవ సేవ" అను స్పూర్తితో లాక్డౌన్ రోజునుండి సేవ చేస్తూ వారి దొడ్డ మనసును సేవా తత్పరతను చాటుకుంటున్నవి. మరిన్ని వివరాలకు మా గూగుల్ పేజీ  HTTPS://avopabulletin.page ని చూడండి. ఈ విధంగా సాటి, తోటివారికి సహాయ పడుచున్న అన్ని అవోపాల అధ్యక్ష కార్యదర్శ్ లను వాటి సభ్యులను మరియు కోవిద్-19 మహమ్మారిని ఎదుర్కోనుటకు ముఖ్యమంత్రి సహాయ నిధికి, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరియు వాసవీ సేవా కేంద్రంలో వారు చేయుచున్న ఆహార పొట్లాల మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా భాగస్వామి అవడానికి మంచి మనసుతో మాకు మీరు పంపించుచున్న చందాలకు తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. తదనుగుణంగా హైదరాబాద్ లో రాష్ట్ర అవోపా ఖైరతాబాద్ లోని వాసవీ సేవా కేంద్రానికి లక్ష రూపాయలను విరాలమిఛ్చి వారితో కలిసి రోజూ 4000 ల ఆహార పొట్లాలను, నిత్యావసర సరుకులను లాక్డౌన్ బాధితులకు, యుధ్ద ప్రాతిపదికన పనిచేయుచున్న పోలీస్, సానిటరీ, వైద్య సిబ్బంది, తదితరులకు అందించుచున్నాము.  ఇందులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖలు సంయుక్తంగా విడుదల చేసిన లోగోలో 37 సేవా సంస్థలలో 12 వైశ్య సేవా సంస్థలు అనగా, వాసవీ సేవా కేంద్రం, IVF, VBG, WAM, ఉప్పల ఫౌండేషన్, కాచిగూడ వైశ్య హాస్టల్ మొదలగు సేవా సంస్థలను గుర్తించి అగ్ర భాగాన ఉంచడము వైశ్యుల దాతృత్వానికి నిదర్శనం. అందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు విభాగానికి ముఖ్యంగా అన్ని వర్గాల వారిని అన్ని సంస్థలను అనుసంధానం చేసి ఈ బృహత్తర కార్యాన్ని విజయ పథంలో నడిపించుచున్న పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారికి కూడా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నవి.


 


 


కామెంట్‌లు