వైశ్య సేవా సంస్థలకు V3 ఛానల్ లో ఉచిత కవరేజ్

అవొపాలు, ఆర్యవైశ్య సంస్థలు చేయుచున్న ప్రాయోజిత కార్యక్రమాలకు ఉత్తేజితుడై మీడియా కవరెజి గురించి తన V3 ఛానల్ సేవలు వినియోగించుకొమ్మని V3 ఛానల్ అధినేత శ్రీ కాచం సత్యనారాయణ గారు తెలియజేయుచున్నారు. కాచం గారి విజ్ఞప్తి క్రింద ఇవ్వనైనది. ఇంకనూ వివరాలు పొందగోరు వారు ఎడిటర్ నూకా యాదగిరిని ఫోన్ నెం.9949023236 లో సంప్రదించగలరు. వివిధ సామాజిక సేవలందిస్తున్న వైశ్య సంస్థ లన్నింటికి  V3 ఛానల్ మరియు వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం విజ్ఞప్తి:


  మొదట విధించిన లాక్డౌన్ పీరియడ్  పూర్తి అయింది. భారత ప్రధాని మోడీ గారు మరో 19 రోజులు లాక్డౌన్ పొడిగించారు అంటే మే 3 వరకు లాక్ డౌన్  ఉంటుంది. దానితో పాటు 7 సూత్రాలను పాటించ వలసిందిగా అభ్యర్తించారు ప్రధాని. పేదలు, నిర్భాగ్యులు, ఆకలితో అలమటించే వారిని సాధ్యమైనంత వరకు ఆదుకొమ్మని ప్రత్యేకంగా చెప్పారు. ఈ దిశలో మన వైశ్యులు, వైశ్య సంస్థలు పేదలకు ఆహార పొట్లాల పంపిణీ పెద్ద ఎత్తున చేస్తూనే ఉన్నారు.V3 ఛానల్, వైశ్య వికాస వేదిక మరియు ఇతర సంస్థలు తమ తమ శక్తి మేరకు పేదలు, నిర్భాగ్యులు, అన్నార్తులను ఆదుకుంటున్నాయి. వైశ్య సమాజ సేవలో తన వంతు బాధ్యతను స్వీకరించిన వైశ్య వికాస వేదిక, V3 ఛానల్  మీ సహాయ కార్యక్రమాల వివరాలు ముందుగా తెలియ చేసినట్లైతే తప్పకుండా మీ మీ కార్యక్రమాలను  నిస్వార్థంగా, తమ బాధ్యతగా భావించి, కవర్ చేసే బాధ్యతను స్వీకరిస్తూ, మా సేవలను వినియోగించు కోవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది.
సదా మీ సేవలో,
భవదీయుడు,
కాచం సత్యనారాయణ, V3 ఛానల్, వైశ్య వికాస వేదిక ఛైర్మన్. 9441222429 off no 040 -40032429


కామెంట్‌లు