సుబ్బారావు గారికి సన్మానం


చంద్ర తేజలయా మ్యూజిక్ అకాడమీ వారు వారి నూతన సంస్థ ప్రారంభోత్సవ సమావేశము తేదీ 1.3.2020 రోజున చిక్కడపల్లి లోని శ్రీ త్యాగరాయ గానసభ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ కె.వి.రమణాచారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  ముఖ్య అతిథిగా విచ్చేయగా సేవా  సార్వభౌమ లయన్ డా.ఏ. విజయ కుమార్ గారు సభాధ్యక్షత వహించారు. సభను పద్మభూషణ్ డా.కె.వి.వరప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట, ఆత్మీయ, గౌరవ అతిథులనేక మంది ప్రముఖులు హాజరైనారు. చంద్రతేజ సంస్థ అధ్యక్షుడు, ప్లేబ్యాక్ సింగర్ ఘంటసాల గారి పాటలను చెవులకింపుగా పాడి శ్రోతలను ఆకట్టుకున్నారు. పలువురు గాయనిమణులు కూడా వారి స్వర పరిచయం గావించారు.  ఇదే సభావేదిక పైన ప్రజా సేవకుడు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రిటైర్డ్ డివిజనల్ మేనేజర్ శ్రీ సి.ఎచ్.సి. సుబ్బారావు గారిని మరియు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ శ్రీ బి.వి.వి.ఎస్ మూర్తి గారలను ఘనంగా సన్మానించారు.  సన్మానగ్రహిత శ్రీ సుబ్బారావు గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి, సలహాదారు డా.లక్మయ్య, చీఫ్ ఏడిటర్ కూర చిదంబరం అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు నమశివాయ, ఆర్థిక కార్యదర్శి మాకం భద్రినాథ్ తదితరులు అభినందించారు. 


కామెంట్‌లు