జనతా కర్ఫ్యూ


జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం   ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు                                                 కర్ఫ్యూ పాటించుటకు గల కారణాలు : కరోన వైరస్ జీవితం 12 గంటలు. జనతా కర్ఫ్యూ 14 గంటలు. అంటే కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గం.ల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి, అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు. ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేధిస్తున్నామన్నమాట మరియు అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి.  దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని... మన ప్రధాని మోడీ గారి ఉద్ధేశ్యం కావచ్చును. ఇది మన కోసం, మనవాండ్ల కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం, ఇది మనం చేయగలం, సంయమనం పాటించగలం, ఎందుకంటే మన సంకల్ప బలం గొప్పది కావున మనం ఈ విధంగా చేసి మన వాండ్లను రక్షించు కుందాం. ప్రపంచానికి మార్గదర్శకులమవుదాం. ఈ మహాత్కార్యంలో భాగ స్వాములమువుదాం. మరియొక మనవి. అదేరోజు సాయంత్రం 5 గం.లకు కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎంతగానో శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర అత్యవసర సేవా సిబ్బంది (టెలిఫోన్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు, అంబులెన్స్ డ్రైవర్ నుండి ఆకుకూరలు, పాల పాకెట్లు వేసే కుర్రాడు వరకూ) కృతజ్ఞతగా ఇంటి వాకిట్లోకి/బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొడుతూ జేజేలు పలుకుదాం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా వారి ప్రాణాలను సైతం లెక్కచేయక మనకోసం కష్టపడుతున్నారు కాబట్టి.


 


కామెంట్‌లు