అవోపా భవన్ హనుమకొండ నందు వెనిశెట్టి జగదీశ్వరయ్య స్మారక ట్రస్ట్ కార్యక్రమాలు


తేదీ 15.03.2020 రోజున అవోపా భవన్ హనుమకొండ నందు వెనిశెట్టి జగదీశ్వరయ్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవము జరిగినది. ఈ పురస్కారాలు సమాజంలో దివ్యాన్గులకు విశిష్ట సేవలందించిన వారికి, వారి సమస్యల సాధనకు కృషి చేసిన వారికి, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉభయ తెలుగు రాష్ట్రాల సుమారు 65 దివ్యాన్గులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు, మొమెంటోస్ ప్రధానం చేశారు. చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ నగర ప్రథమ పౌరుడు వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ శ్రీ గుండా ప్రకాశరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొనగా శ్రీ వెనిశెట్టి రవికుమార్, చైర్మన్ సంక్షేమ ట్రస్ట్, కరీంనగర్ గారు సభాధ్యక్షత వహించారు.  విశిష్ట అతిథిగా, తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ భాస్కర్ గారు, గౌరవ అతిథిగా మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి గందే రాధిక గారు, ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు, లయన్ క్వేస్ట్ గవర్నర్ శ్రీ పోకల చందర్ గారు, ఆహ్వానితులుగా ప్రఖ్యాత సమాజ సేవకురాలు శ్రీమతి డా.కొత్త కృష్ణవేణి గారు, అవోపా హనుమకొండ అధ్యక్షులు శ్రీ ఎల్లంకి రవీందర్ గారు, హుజురాబాద్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ గర్రెపల్లి శ్రీనివాస్ గారు, సంక్షేమ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ వెనిశెట్టి శరత్ కుమార్ గారు,  వరంగల్ అర్బన్ అవోపా అధ్యక్షుడు కె. రమణయ్య, రామానుజం, కోటిలింగం మరియు అవోపా హుజురాబాద్ సంస్థ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమమును విజయవంతమొనర్చారు.  ట్రస్ట్ సభ్యులు శ్రీ వెనిశెట్టి శివకుమార్ గారు వందన సమర్పణ చేసి ఆహూతులకు షడ్రసోపేతమైన భోజనాలు ఏర్పాటు చేశారు.


ఉగాది పురస్కారాలు


కామెంట్‌లు