అనాధాశ్రమం విద్యార్థులకు అవోపా జఫర్గఢ్ వారిచే  పరీక్షల మెటీరియల్ పంపిణీ


జనగామ జిల్లా జఫర్గడ్ శివారు టీబీ తండా వద్దగల అనాధాశ్రమం లో ఉంటూ 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు అవోపా జఫర్ గడ్ మండలశాఖ ఆధ్వర్యంలో ఆదివారం పరీక్షల మెటీరియల్ ను అందచేసారు. ఆశ్రమ నిర్వాహకురాలు గాదె పుష్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో అవోపా అధ్యక్షులు తాటిపెల్లి సోమయ్య పరీక్షలు రాసే విధానంపై, పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. కార్యదర్శి అంచూరి సురేష్ మాట్లాడుచూ 12 సంవత్సరాలనుండి ఆశ్రమంలోని 10వ తరగతి విద్యార్థులకు  జఫర్ గడ్ అవోపా ఆధ్వర్యంలో  పరీక్షల మెటీరియల్ ను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ  10/10 గ్రేడ్ పాయింట్లు సాధించాలని  కోరారు. ఆశ్రమ నిర్వాహకురాలు గాదె పుష్ప మాట్లాడుచూ దశాబ్థ కాలం పైగా ఆశ్రమానికి వెన్నంటి ఉంటూ సహాయ సహాకారాలు అందిస్తున్నారని పేర్కొంటూ అవోపా జఫర్గడ్ శాఖకు ధన్యవాదములు  తెలిపారు. ఈ కార్యక్రమంలో  అవోపా కోశాధికారి బజ్జూరి మెడికల్ కృష్ణమూర్తి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు