మంచేరియల్ జిల్లా మరియు లక్షేట్టిపెట్ పట్టణ అవోపా వారిచే ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ


ఆదివారం తేదీ 15.3.2020 రోజున మంచేరియల్ జిల్లా మరియు లక్సీట్టిపెట్ పట్టణ అవోపా వారు సంయుక్తంగా అవోపా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌక్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఆవోపా జెండాని ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అవోపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ గుండా సత్యనారాయణ మాట్లాడుచూ 1955 లో K R కృష్ణయ్య శెట్టి గారిచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కేంద్రంగా అవోపా స్థాపించబడినదని, తదుపరి అన్ని జిల్లాలలో, తాలుకాలలో అవోపాల ఏర్పాటు జరిగి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాయని,  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 15 మార్చ్ 2015 తేదీన A P అవోపా నుండి వేరుపడి తెలంగాణ రాష్ట్ర అవోపా  ఏర్పాటు చేయడము జరిగిందనీ,  1 st ఏప్రిల్ 2015 నాడు తెలంగాణ ఆవోపా ను రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగినదని, అప్పటి నుండి 15 మార్చ్ వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవోపా వేడుకలను ఘనంగా నిర్వహించుకొంటున్నామని అవోపాలోని మేధావులు, విద్యావంతులు సమాజం లోని పేదలకు మహిళలకు విద్యార్థులకు వారి జీవన మనుగడకు ఉపయుక్తమైన సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా నూతన శకానికి నాంది పలికామని, సేవ తత్పరతతో అర్హులకు నిస్వార్ధముగా సేవలను అందిస్తూ రాష్ట్రములో ఒక మంచి సంస్థగా గుర్తింపు తీసుకు వచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తముగా ౩౩ జిల్లాలో 100 కు పైగా ఆవోపా యూనిట్లను ఏర్పాటు చేసి విరివిగా సేవ కార్యక్రమాలను చేబడుతూ ఆవోపా రూపొందించిన క్యాలెండరు అఫ్ ఈవెంట్స్ ప్రకారముగా కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించుకొంటూ ఆవోపా పతకాన్ని సమాజములో ఉన్నత స్థాయిలో ఎగిరేటట్టు విరివిగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా జిల్లా అధ్యక్షుడు గుండ  సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్,  రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్ కార్యదర్శి రాజమౌళి జిల్లా ఉపాధ్యక్షుడు  వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్య దర్శి రవీందర్, వైశ్య సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, రమేశ్, సత్తయ్య,  శ్యామ్ సుందర్, ఆవోపా నాయకులు శ్రీనివాస్, సంతోష్, ఉత్తూరు జయం, బజ్జురి మోహన్, రాగుల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. కామెంట్‌లు