అవోపా హుజురాబాద్ పూర్వధ్యక్షుడు రాజాపల్లి హెచ్ఎం రవికుమార్ కు  ఇండియన్ దైడాక్టటిక్ అసోసియేషన్'లో చోటు


 రాజాపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేయుచున్న వెనిశెట్టి రవికుమార్‌కు విద్యాబోధనతో పాటు సమాజాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని గుర్తించి  ఇండియన్ దైడాక్టటిక్ అసోసియేషన్'లో చోటు కల్పిస్తూ పత్రాన్ని జారీ చేసింది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయులు బోధన సామర్థ్యాల్ని పెంపొందించి ఆధునాతన విద్య, సాంకేతికత ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునేందుకు జాతీయ స్థాయిలో వివిధ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో వి వివిధ  ప్రభుత్వ కేంద్రీయ, కార్పొరేట్ విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు సుమారు 535 మంది ఈ సంస్థలో జాబితాలో చోటు కోసం పోటీ పడగా, ఎంపిక చేసిన 46 మందిలో రవికుమార్ ఉండడం విశేషం. ఈ సందర్భంగా చింతసరిత, మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మండలంలోని ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు రవికుమార్‌కు అభినందనలు తెలిపారు. ఇందులకు వీరిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయుచున్నవి.


కామెంట్‌లు