నిజాం వెంకటేశం గారికి అభినందన సత్కారం


తేదీ 16.2.2020 రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయ ప్రాంగణం, అశోకనగర్, హైదరాబాద్ లో విశ్వసాయి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దోసపాటి గురురాజారావు గారు రచించిన శిరిడిసాయి చాలీసా ఆవిష్కరణ 108వ దద్గురు వైభవం ధార్మిక ప్రవచన జ్ఞాన యజ్ఞం సమాపనోత్సవంలో తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారితో సహా 26 మంది ధార్మిక దంపతులకు అభినందన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఐ.ఏ.ఎస్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ కె.వి.రమణాచారి గారు ఐ.ఏ.ఎస్, ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘము చేర్మన్ జస్టిస్ శ్రీ జి.చంద్రయ్య గారు, మరియొక విశిష్ట అతిథి విశ్రాంత న్యాయమూర్తి శ్రీ ఎం.వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవ అతిథులుగా శ్రీ నాగమారుతి శర్మ తదితరులు హాజరుకాగా వి.ఐ.ఎచ్.ఈ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణాపురం  శ్రీ ఏ.ఎస్.రెడ్డి గారు సభాధ్యక్షత వహించారు. ఆద్యంతం ఉత్సాహ భరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో చాలామంది ధార్మిక దంపతులు, వారి హితులు సన్నిహితులు పాల్గొని ధార్మిక దంపతులకు అభినందనలు తెలిపారు. తదుపరి భక్తి సంగీత విభావరి నిర్వహించారు. కామెంట్‌లు