సి.ఎం.కె.సి.ఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు


ఆత్మ బలిదానికి సైతం వెరువక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అహర్నిశలు పాటుపడి, ప్రత్యేక తెలంగాణాను సాధించి, బంగారు తెలంగాణను నిర్మించాలని అవిరళ కృషి సలుపుచున్న ఉద్యమ నాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ,  నవతెలంగాణ నిర్మాణంలో వైశ్యులపై నమ్మకముంచి వారి అభ్యున్నతికి 5 ఎకరాల భూమిని కేటాయించి, ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలన్న సహృదయంతో బంగారు తెలంగాణ స్థాపణలో భాగస్వాములను చేయాలని మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది చైర్మన్లను 4గురు వైస్ చైర్మన్లను గెలిపించి ఆర్యవైశ్యులకు రాజకీయ ఉపిరులూదిన రాజకీయ చాణక్యుడు, సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖారరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు వారి కమిటీ మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు వారి సంపాదక వర్గము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని వాసవీమాత కృపాకటాక్షాలు వీరికి ఎల్లప్పుడు ఉండాలనీ, సంపూర్ణ ఆయురారోగ్యాలతో విలసిల్లాలనీ మనస్ఫూర్తిగా కోరుకోనుచున్నారు. 


కామెంట్‌లు