కరీంనగర్ కలెక్టర్ చే గోడపత్రిక ఆవిష్కరణ


గాంధీ వర్ధంతి సందర్భముగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కే. శశాంకగారు మానేరు పర్యావరణ సమితి రూపొందించిన గాంధీజీ జీవితం- పర్యావరణ  సందేశం అను గోడ పత్రికను పాలనాధికారి సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈసందర్బముగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత శుభ్రతతో పాటుగా  పరిసరాల పరిశుభ్రతను పాటించి నగరాన్ని క్లిన్ సిటీగా తీర్చిదిద్దాముఅని అదే గాంధీజీకి ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు. ప్రస్తుత తరుణములో వాతావరణంలో జల శబ్ద కాలుష్యాలు పెరిగిపోతున్నాయని వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కల పెంపకం చేబట్టి సంరక్షించాలని అన్నారు. గాంధీజీ జీవితాన్ని ఆదర్శముగా తీసుకొని స్వచ్ఛత పాటించాలని పిలిపు నిచ్చారు. తదుపరి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ ప్రావీణ్య గారు, రాష్ట్ర ఆవోపా అధ్యక్షులు గంజి స్వరాజ్యబాబు, సలహాదారులు తోట లక్ష్మణ్ రావు , కార్యదర్శి పాత వెంకటనర్సయ్య , శాతవాతాహన రీజియన్ ఉపాధ్యక్షులు జంధ్యం మధుకర్ , మేడిశెట్టి గోపాల్, రాపర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారుకామెంట్‌లు