జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ ను అభినందించిన పోకల చందర్


తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు,  లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ పోకల చందర్  వారి సోదరుడైన పోకల లింగయ్య గారి భార్య శ్రీమతి పోకల జమున జనగామ మున్సిపాలిటికి చైర్ పర్సన్ గా ఎన్నికైనందులకు ఆమెను మంగళవారం వారి స్వగృహములో లయన్స్ జిల్లా క్యాబినెట్ అదనపు కార్యదర్శి కన్న పరశురాములు, జిల్లా చైర్మన్ నాగబండి రవీందర్ గారలతో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ జమున లింగయ్య దంపతులు పార్టీ, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సేవచేసి మంచిపేరు సంపాదించుకోవాలని సూచించారు.


కామెంట్‌లు