అవోపా హబ్సిగూడా వారు నిర్వహించిన వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం


తేది 26th January, 2020 ఆదివారం రోజున అవోప హబ్సిగూడ వారు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా స్థానిక తార్నాక కమ్యూనిటీ హాల్ లో పూజా కార్యక్రమమును నిర్వహించారు. అవోపా హబ్సిగూడా అధ్యక్షుడు శ్రీ జూలూరు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిండికేట్ బ్యాంక్ రిటైర్డ్ సి.ఎం, ప్రముఖ కవి  మరియు రాష్ట్ర ప్రభుత్వ భాషా సేవా పురస్కార గ్రహీత Dr.రాధశ్రీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి  అమ్మవారి జీవిత చరిత్రతో పాటు ఆత్మార్పణ గురించి చక్కగా విశదీకరించారు. అవోపా హబ్సిగూడా సీనియర్ సభ్యుడు కొండాపూర్ వాసి రాయపూడి మోహన్ దాస్ దంపతులు మెరుగైన ఆరోగ్యానికి పాటించవలసిన ఆహారపు అలవాట్లను, ఆరోగ్యవంతులుగా నుండుటకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ కార్యక్రమములో 10 మంది ప్రొఫెషనల్స్ నూతన సభ్యులుగా చేరగా వారితో శ్రీ సి.సుధాకర్ గారు, మద్ది హనుమంతరావు గారు మరియు చిన్నయ్య గారు ప్రమాణ స్వీకారం గావించారు. కార్యక్రమారంభంలో అధ్యక్షుడు ప్రొఫెసర్ శివకుమార్ గారు స్వాగతోపన్యాసం చేయగా ప్రధాన కార్యదర్శి సి.ఎన్. భవాని గారు కార్యదర్శి నివేదిక లో అవోప హబ్సిగూడ చేపట్టుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించగా ఆర్ధిక కార్యదర్శి మాచర్ల హరిప్రసాద్ గారు ఆర్థిక నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది అవోపా సభ్యులు, మహిళలు పిల్లలు పాల్గొని వోట్ ఆఫ్ థాంక్స్ తర్వాత ఏర్పాటుచేసిన షడ్రసోపేత మధ్యాహ్న భోజననంతరము వాసవిమాత త్యాగాన్ని ప్రశంసించుకుంటూ గృహోన్ముఖులైనారు. 
కామెంట్‌లు