నిజాం గారికి జన్మదిన శుభాకాంక్షలు


శ్రీ నిజాం వెంకటేశం గారు తన పుట్టిన రోజు వేడుకలను బాల బాలికల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. 
డా. సూర్యప్రకాశ్, కామేశ్వరి గార్లు ప్రత్యేకంగా నిజాం గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన" బాలల కథా శిక్షణ శిబిరానికి" వారిని ముఖ్య అతిథిగా పిలిచి, పాల్గొన్న 83 మంది బాలబాలికలకు వారిచే బహుమతి ప్రదానం గావించారు. శిబిరం నిర్వహించిన దాసరి వెంకరమణకు, హాజరయిన ఉష తురగ రావెళ్ళి, కొండేపూడి నిర్మల, రేణుక అయోల, డా. నరేంద్ర ప్రసాద్, ఝాన్సి, పతంజలి గారలకు నిజాం వెంకటేశం గారు అభినందనలు తెలియజేశారు. జన్మదినాన్ని బాలల మధ్య జరుపుకున్న నిజాం వెంకటేశం గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా అవోపా న్యూస్ బులెటిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు