కరీంనగర్ టౌన్ అవోపా అవార్డ్స్ ఫంక్షన్


తేదీ 4.10.2019 రోజున కరీంనగర్ వైశ్య భవన్లో కరీంనగర్ టౌన్ అవోపా వారు అధ్యక్షుడు కట్కూరు సుధాకర్ గారి నేతృత్వంలో ప్రతిభ కనబరిచిన సుమారు 30 మంది విద్యార్థినీ విద్యార్థులకు అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ముఖ్య సలహాదారు పోకల చందర్, చీఫ్ కోఆర్డినేటర్ గుండా చంద్రమౌళి, సలహాదారు మునిగేటి సత్యనారాయణ, చీఫ్ ఎడిటర్ కూర చిదంబరం కరీంనగర్ జిల్లా అవోపా అధ్యక్ష కార్యదర్శులు యూనిట్ అవోపా అధ్యక్షులు కార్యదర్శులు పతక గ్రహితల తల్లిదండ్రులు పుర ప్రముఖులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంత మొనర్చినారు. 


కామెంట్‌లు