అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ గాంధీ జయంతి వేడుకలు


ఆవోపా బ్యాంక్ మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈరోజు కాచిగూడ వైశ్య హాస్టల్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. సీల్ వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బండారు సుబ్బారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ బ్రదర్స్ డైరెక్టర్ శ్రీ సి రాజమౌళి, శత చిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, వి 3 ఛానల్ అధినేత శ్రీ కాచం సత్యనారాయణ, తెలంగాణ  స్టేట్ ఆవోపా జనరల్ సెక్రెటరీ శ్రీ నిజాం వెంకటేశం, ది ఫిఫ్త్ ఎస్టేట్ ప్రెసిడెంట్ శ్రీ చైతన్య రాయపూడి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీ పి వి రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పదవుల్లో  ఉన్న శ్రీ మోహన్ దాస్, శ్రీ కె వి ఎస్ గుప్త, శ్రీ రామానందం,శ్రీ లీలా శంకర్, శ్రీ మద్ది హనుమంతరావు, శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి మణిమాల తమ సహకారం అందించారు. ఆద్యంతం అలరిస్తూ సభా నిర్వహణ కావించిన ట్యాగ్ లైన్ కింగ్ శ్రీ ఆలపాటి వాక్చాతుర్యానికి శ్రోతలతో సహా, అతిథులందరూ ఆనందం వ్యక్తం చేశారు.  అందరూ తమ తమ ప్రసంగాలతో జాతిపిత ఘనతని వేనోళ్ళ కొనియాడారు. ఈ సందర్భంగా  సహాయార్దులకు నగదు సహాయం, దుస్తుల పంపిణీ జరిగింది. సీల్ వెల్ కార్పొరేషన్, ఆర్ ఎస్ బ్రదర్స్ సంస్థల ఔదార్యాన్ని అందరూ ప్రశంసించారు. సభా కార్యక్రమానికి పూర్వం శ్రీ పవన్ కుమార్ పాటలు ఆకట్టుకుని హాజరైన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేయడం విశేషం. తదుపరి మాతృ అభయ ఫౌండేషన్ వారి 84 మంది అనాధ పిల్లలకు బట్టలు బూట్లు పంపిణీ చేశారు. 


గాంధీ జయంతి వేడుకలు


కామెంట్‌లు