మంచిర్యాల టౌన్ అవోపా ఎన్నికలు

తేదీ 29.7.2019 రోజున స్థానిక  వైశ్య భవన్ మంచిర్యాలలో టౌన్ అవోపా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవము  తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సిరిపురం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినది. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడు తంగడపల్లి సత్యవర్ధన్, కార్యదర్శి సైని సత్యనారాయణ కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ మరియు వారి కార్య వర్గ సభ్యులచే మరియు నూతనంగా ఎన్నికైన అవోపా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కవిత, కార్యదర్శి శ్రీమతి తంగడపల్లి గిరిజ, కోశాధికారి శ్రీమతి నూకా సునీత గారలచే తెలంగాణ రాష్ట్ర అవోపా ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారు ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమానికి న్యూస్ బులెటిన్ సంపాదకులు నూకా యాదగిరి తెలంగాణ రాష్ట్ర అవోపా చీఫ్ కో-ఆర్డినేటర్ గుండా చంద్రమౌలి, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు గుండా ప్రభాకర్, రాష్ట్రఅవోపా కార్యదర్శి వల్లాల సత్తయ్య, రాష్ట్ర ఆర్గనైజర్ వజ్జల రాజమౌళి, శాతవాహన రీజియన్ వైస్ ప్రెసిడెంట్ జంధ్యం మధుకర్, మంచిర్యాల జిల్లా అవోపా అధ్యక్షుడు శ్రీ గుండా సత్యనారాయణ, జిల్లా అవోపా మాజీ అధ్యక్షులు శ్రీ పల్లెర్ల శ్రీహరి, బల్లు శంకర్లింగం గారలు, కరీంనగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు శ్రీ సుధాకర్ అవోపా సభ్యులు, పట్టణ ప్రముఖులు మహిళలు అధిక సంఖ్యలో హాజరైనారు. శ్రీ గుండా ప్రభాకర్ గారు వాసవి మాత చరిత్రను చదివి వినిపించి క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులందజేశారు. నూతనంగా ఎన్నికైన పి.ఎస్.టి లకు తెలంగాణ రాష్ట్ర అవోపా అభినందనలు తెలుపు చున్నది.


కామెంట్‌లు