నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_13, డిసెంబర్ , 2020_* *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. *_నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే మంచిది._*    

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

ఈరోజు

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. *_హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*  

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం._*  

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. *_శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_చంద్రశేఖరాష్టకం చదివితే మంచిది._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

మంచి సమయం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. *_సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఈరోజు

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠిస్తే మంచిది._*  

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. *_ఇష్టదేవతా నామస్మరణ ఉత్తమం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో మేలు జరుగుతుంది. *_సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది._* 

 🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు చేసే విషయంలో సాగదీత వద్దు. పనులు త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికను సిద్ధం చేయండి. *__ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

శుభకాలం. కొన్ని వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభదాయక ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. *_శివారాధన చేస్తే మంచిది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు