డాక్టర్. శ్రీ చింతల శ్రీనివాస్ గారి స్పెషల్ లైవ్ షో


కవిరత్న, ఉపన్యాస సామ్రాట్, వైశ్య రత్న, డాక్టర్. శ్రీ చింతల శ్రీనివాస్ తెలుగు ఎన్.ఆర్.ఐ రేడియో ఛానెల్లో శ్రీదేవి గారి వ్యాఖ్యాతగా వ్యవహరించినస్పెషల్ లైవ్ షో లో   తన ఆత్మకథ గూర్చి, వారికి కవిత్వం వ్రాయడంలో, పుస్తకాలు రచించడంలో ప్రేరణ నొసంగిన త్రిమూర్తులు అమ్మ, నాన్న అర్థాంగి గురించి గొప్పగా చెప్పి, తాను వృత్తిలో ఎలా రాణించింది, ప్రవుత్తి అయిన రచనా రంగంలో, సేవా రంగంలో ఎంతటి గొప్పవారి ప్రశంసలు పొందారో, ఎన్ని బిరుదులు పొందారో విపులంగా వివరిస్తూ, శ్రోతలు సంధించిన ప్రశ్నలకు ఎంతో ఓపికతో జవాబిస్తూ వారి కోరిక మేరకు అశుకవిత్వంతో వారి చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపిన తీరు చాలా మధురంగా, ఆహ్లాదకరంగా వీనుల విందుగా స్ఫురించింది. చాలా చక్కని లైవ్ షో చేసిన శ్రీనివాస్ గారికి హార్ధిక అభినందనలు, శుభాకాంక్షలు. చక్కని వ్యాఖ్యాతగా కవిరత్న గారిని ఉత్సాహ పరచి విషయ సేకరణ చేసిన శ్రీదేవి గారికి కూడా తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలియజేయు చున్నవి


కామెంట్‌లు