కార్తీక వనభోజన కార్యక్రమం


అవోపా హైదరాబాద్ వారు తేదీ 17 నవంబర్ 2019, ఆదివారం రోజున కార్తిక వనభోజన కార్యక్రమాన్ని, శ్రీ కోదండ రామాలయం, ఎస్బిహెచ్ 'బి' కాలనీ, సైదాబాద్ వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుప నున్నామని,   ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు ఈ విధంగా వుండునని తెలియజేయుచున్నారు.
1. ఉదయం 9 నుండి 9.30 వరకు అల్పాహారం 
2. బ్రహ్మణోత్తమునిచే వుసిరి చెట్టు పూజ,
3. కపిల గోపుజ 
4. వెల్కం డ్రింక్ - టీ / కాఫీ లైవ్ పాప్‌కార్న్, పీచు మిఠాయ్ లతో,
5. 'తంబోలా', 'రింగు వేయి గిఫ్ట్ కొట్టు', 'క్రేజీ రైఫిల్ షూటింగ్' లాంటి  మరెన్నో థ్రిల్లింగ్ ఆటల తో. 
6. చాలా రుచికరమైన వంటలు , ఎన్నో ప్రత్యేకతలతో నిండిన భోజనాల నందించు వారని పేరు గాంచిన సుప్ర సిద్ధ'ఆర్కె క్యాటరర్స్'  వారి శడ్రసో పేతమైన మధురమైన విలాసవంతమైన భోజనం                                          7. (80) పాఠశాలల విద్యార్థులకు  ఎలిక్యూషన్ మరియు వ్యాస రచన పోటీలు, విజేతలకు బహుమతుల పంపిణీ 
8. శ్రీ వాసవి మాతా ప్రార్థన యొక్క ఉత్తమ గాయకులకు బహుమతులు (డాక్టర్ కవిరత్న చింతల శ్రీనివాస్ గారు నిర్వహించి, స్పాన్సర్ చేసి నవి )
9. రుచికరమైన బార్బిక్స్ టీ / కాఫీల తో స్నాక్స్.
    పై కార్యక్రమాలలో పాలుపంచుకోడానికి ఒక్కొక్కరికి
టికెట్‌ ధర సబ్సిడీ పై 200 /లు - (వాస్తవ ధర రూ .500 / - లు)  పరిమితంగా ఉన్న సీట్లు తేదీ 14 నవంబర్ 2019  నాటికి ముగియ నున్నాయి. కావున పై ప్రోగ్రాంలో పాల్గొను వారు వారి పేర్లను 14.11.2019 లోగా రిజిస్ట్రేషన్ చేపించుకోగలరని, 17 న సరదాగా ఉల్లాసంగా గడిపే పై కార్యక్రమాన్ని మరియు ఆత్మీయంగా కలిసే మెగా కుటుంబాన్ని మిస్ కావద్దని అధ్యక్షులవారు సభ్యులందరికీ సలహా ఇస్తున్నారు. పై మెగా ఇవేంట్కు రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బు చెల్లించ గోరు వారు గుల్ పే / పేటీఎం ద్వారా నెం .9849716516  కు చెల్లించగలరని, మీరు చెల్లించిన మొత్తమును సులభంగా గుర్తించడానికి చెల్లింపు సమయంలో 'కె.వి.బి'కి అని వ్రాసి (మీ పేరు & మొబైల్ నంబరును విధిగా పేర్కొనండి) తర్వాత చెల్లించిన వారి పేరు,  మొబైల్ నంబర్ మరియు చెల్లించిన గుర్తింపు నంబర్ తో ఎంతమంది కొరకు డబ్బు చెల్లించారో తెలియబరుస్తూ వారి పేర్లతో ఒక లేఖ ప్రాజెక్ట్ ఛైర్మన్ శ్రీ సంపత్ కుమార్ 9989766333 గారికి లేదా దయానంద్ 9246186865 గారలకు తెలియజేయగలరు. ఇట్లు - గౌరవంతో ఆర్ నమశివయ అధ్యక్షుడు 9849039577 ఓం రవి గుప్తా ప్రధాన కార్యదర్శి 99481 55668 మకం బద్రీనాథ్ కోశాధికారి 98497 16516 సంపమార్ కుమార్ ప్రాజెక్ట్ చైర్మన్ 99897 66333


కామెంట్‌లు