అభినందనలు     తేదీ13.10.2019 రోజున తెలంగాణ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారు అంబర్ పెట్ లోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన 3వ తెలంగాణ మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2019 పోటీలో అవోపా హైదరాబాద్ సలహాదారు,  తెలంగాణ రాష్ట్ర అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ కూర చిదంబరం గారు 50 మీటర్ల దూరాన్ని ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో కేవలం 01.17.19 నిమిషాలలో పూర్తి చేసి విజేతగా నిలచి 3 బంగారు పథకాలను ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆ బంగారు పథకాలు తన గెలుపునకు వారి అర్థాంగి ఇఛ్చిన బలమని,  స్ఫూర్తి అని తెలుపుతూ ఆమెకు అంకిత మిచ్చారు. బంగారు పథకాలు గెలుచుకుని విశాల హృదయంతో వారి శ్రీమతి గారికి అంకితమిఛ్చిన కూర చిదంబరం గారిని రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్యబాబు వారి కమిటి మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి అభినందిస్తున్నారు. కామెంట్‌లు