సన్మానం


తేదీ 7.9.2019 న ఉపాధ్యాయుల దినము రోజున  ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించు కార్యక్రమములో భాగంగా హైదరాబాద్ ఎలైట్ లయన్స్ క్లబ్ వారు పబ్లిక్ గార్డెన్స్ లోని ఇందిరా ప్రియదర్శిని సమావేశ మందిరం లో10 జిల్లాలనుండి ఎంపిక జేసిన సుమారు 300 మంది ఉపాధ్యాయులను సన్మానించారు.  ఆ సమావేశమునకు కినోట్ స్పీకర్ గా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య సులహాదారు శ్రీ పోకల చందర్ గారు వ్యవహరించి తనదైన ఆసు కవితా శైలిలో సభికులను మంత్ర ముగ్దులను గావించి అందరిని ఆకట్టుకున్నందులకు నిర్వాహకులు వారిని ఉచిత రీతిని గౌరవించి సన్మానించారు. కావున వారికి తెలంగాణ అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు