అవోపా హుజుర్నగర్ వార్షిక సమావేశాలు


ది.18.08.2019 ఆదివారం ఉదయం 10 గంటలకు హుజుర్నగర్ అవోపా వారి 35వ వార్షిక సమావేశం అవోపా హుజుర్నగర్ అధ్యక్షుడు వంగవేటి హనుమంతరావు గారి అద్యక్షతన స్థానిక వాసవిభవనం లో  జరిగినదని ఈ కార్యక్రమంలో 89 మంది  పేద ఆర్యవైశ్య మెరిట్ విద్యార్థులకు 1.24 లక్షల ఉపకార వేతనాలు , పేద విద్యార్థులకు విద్యోపకరణములు, యూనిఫామ్ డ్రస్సులతో బాటు 7గురు మెరిటీవిద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించ బడినవని 31 మంది పేద ఆర్యవైశ్య  మహిళలకు  పెన్షన్ల తోపాటు చీరలుపంచబడినవనియూ వీటితో పాటు ప్రోపెషనల్ విద్య నభ్యసిస్తున్న 5 గురు విద్యార్థులకు  విద్యనభ్యసించు పూర్తి ఖర్చు Rs.2.5లక్ష లను దాతల సహకారంతో అందించడమైనదని మరియు దాతలను సగౌరవంగా సత్కరించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి అవోపా సభ్యులతోబాటు స్థానిక నేతలు, పుర ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో విచ్ఛేసి కార్య క్రమాన్ని విజయవంత మొనర్చారని అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలియజేసాడు. ఇంత మంచి కార్యక్రమము నిర్వహించిన అవోపా హుజుర్నగర్ అవోపా వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.
   


కామెంట్‌లు