తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా కందికొండ శ్రీనివాస్

 


రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మరియు హోంశాఖ మాత్యులు శ్రీ మహమూద్ అలీ గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో తేదీ 5.9.2023 రోజున  అచ్చంపేట మండలంలోని చెన్నారం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ఆర్థిక కార్యదర్శి శ్రీ కందికొండ శ్రీనివాస్ గారికి అవార్డు ప్రధానం జరిగినది. 

 ఈ సందర్భంగా శ్రీ కందికొండ శ్రీనివాస్ గారు మాట్లాడుచూ తాను పాఠశాల విద్యార్థులకు మిషన్ భగీరథ ద్వారా త్రాగడానికి నీరు ఏర్పాటు చేశానని,  విద్యార్థుల హాజరు శాతము పెంచుట కొరకు ప్రతినెల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు మరియు విద్యార్థులకు బాలల సభ నిర్వహింఛానని, గ్రామ సర్పంచ్ నరసింహరెడ్డి గారి సహకారంతో విద్యార్థులకు కూర్చోవడానికి డ్యూయల్ డెక్సులు, టై, బెల్టు మరియు బ్యాడ్జీలు ఏర్పాటు చేశానని, పాఠశాలలో హరితహారం కార్యక్రమం నిర్వహించానని, జాతీయ గణిత దినోత్సవం  డిసెంబర్ 22 పురస్కరించుకొని ఎస్సీఆర్టి వారు నిర్వహించు రాష్ట్రస్థాయి సెమినార్స్ లో వరుసగా మూడు సంవత్సరాలు పాల్గొన్నాని, జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులకు మండల మరియు జిల్లా స్థాయిలో గణిత ప్రతిభా పరీక్షలు నిర్వహించడం మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన కొరకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశానని, పదవ తరగతి విద్యార్థులకు సులభతరమైన పద్ధతులతో మెటీరియల్ తయారుచేసి అందింఛానని, కరోనా సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడం మరియు ఉపాధ్యాయులకు రోబోకంపాస్ పై శిక్షణ అందించానని అందులకు రాష్ట్ర ప్రజభుత్వం తన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రసాదించారని అందులకు తనకు  చాలా సంతోషంగా ఉందని అవార్డు అందించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రఖర్ గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారికి, హోమ్ మంత్రి శ్రీ మహముద్ అలీ గారికి తన పేరును రికమెండ్ చేసిన విద్యాశాఖ అధికార గణానికి, తనను అభినందించిన రాష్ట్ర అవోపా అధ్యక్ష కార్యదర్శులకు, రాష్ట్ర మహిళా విభాగ్ కార్యవర్గాన్ని హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గణితంలో సులభతరమైన పద్ధతులు కనుక్కొని విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ఇందులకు వీరిని మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ మలిపెద్ధి శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీ పోలా శ్రీధర్, అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ సిరిపురం శ్రీనివాస్, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ శ్రీ నూక యాదగిరి మరియు సలహాదారులు శ్రీ పోకల చందర్ శ్రీ గంజి స్వరాజ్య బాబు తదితరులు హృదయ పూర్వక అభినందనలు తెలుపుచూ వీరు ఇలాంటి ఎన్నో అవార్డ్ లు పొందాలని, విద్యాశాఖ కు, అవోపాకు మరిన్ని సేవాలందించాలని అవోపా న్యూస్ బులెటిన్ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా అభిలషిస్తున్నవి.

వీడియో చూచుటకు ఈ క్రింది లింక్ పై నొక్కండి.

https://youtu.be/l3Eo6HwRllY?si=CmdSICWmLQGMRiat

 

కామెంట్‌లు