ఆవోపా హబ్సిగూడ సభ్యుడు పి.రామ్ మనోహర్ గారి కుమారుడు శ్రీ విక్రమ్ పోతుగంటి S.B.I.Rasmecc Kalaburgi, Bangalore నందు Assistant General Manager గా పని చేయుచు న్నారు. వీరు 2022-23 సంవత్సరం లో అందించిన విశిష్ట సేవలకు గాను వీరికి అభినందన పురస్కార అవార్డ్ జోనల్ ఆఫీసులో అందచేశారు.
వీరికి మరియొక అవార్డ్ S.B.I. Life Championship Award (Bangalore Circle) 25-02-2023 రోజున బెంగుళూరు లోని వారి Circle కార్యాలయంలో Chief General Manager S.B.I.Life M.D.గారి సమక్షం లో అంద చేశారు, మరియు C.G.M CLUB MEMBER గా కూడా తీసుకున్నారు. ఇది చాలా అత్యుత్తమ గుర్తింపు. ఇలాంటి అవార్డులు పొందాలంటే అకుంఠిత దీక్ష, సామర్థ్యాలు ఉండాలి. ఇవి మన వైశ్యులలో పుష్కలం అని మన వారు అనేక రంగాలలో ప్రూవ్ చేయు చున్నారు. విక్రమ్ గారి పురోగతి మన యువతకెంతో స్ఫూర్తి, ఆదర్శం. ఇలాంటి పురస్కారాలు, అవార్డులు పొందిన వారికే కాదు మన ఆర్యవైశ్య జాతికే గర్వకారణం. ఇందులకు తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ మరియు అవోపా హబ్సిగూడా వీరిని అభినందిస్తూ వీరు ముందు ముందు మరెన్నో అవార్డులు, పురస్కారాలు పొందాలని ఆకాంక్షిస్తున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి