అవోపా హబ్సిగూడా నూతన కమిటి కి అభినందనలు

 

తేది 26.2.2023 రోజున అవోపా హబ్సిగూడా వారు వారి వార్షిక  సర్వసభ్య సమావేశము తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశ మందిరంలో శ్రీ శివకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశ ప్రారంభం వాసవీ మాత పూజతో ప్రారంభ మైనది. తదుపరి ఎన్నికల అధికారిగా నియమింపబడిన శ్రీ చిన్నయ్య గారు కార్య నిర్వాహక కమిటీకి ఎన్నికలు నిర్వహించి, ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ క్రింది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 

1) అధ్యక్షుడు     ...    శ్రీ జి. కృష్ణయ్య

2) కార్యదర్శి      ...    శ్రీ రాజేంద్రప్రసాద్

3) కోశాధికారి     ...    శ్రీ ఎం. శ్రీనివాసరావు

2) ఉపాధ్యక్షుడు ...    శ్రీ రమణ కిషోర్

3) ఉపాధ్యక్షుడు ...    శ్రీ సి. ఎచ్. సుధాకర్

4) సంయుక్త కార్యదర్శి ... శ్రీ కె. సత్యమూర్తి

పాత కమిటీ వారు క్రొత్త కమిటీ వారికి ఛార్జ్ అప్పగించారు. నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన పై కమిటీ సభ్యులందరికి ఎన్నికల అధికారి చిన్నయ్య గారు, తెలంగాణ రాష్ట్ర అవోపా పక్షాన అవోపా న్యూస్ బులెటిన్ సంపాదకులు నూక యాదగిరి గారు,  పూర్వధ్యక్షులు హనుమంతరావు గారు, లక్ష్మీనారాయణ గారు అభినందనలు తెలియజేశారు.  నూతనంగా ఎన్నికైన  వారు కృతజ్ఞతలు తెలియజేయుచూ హబ్సిగూడా సభ్యత్వం పెంచుతామని, అన్ని కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని, ఈ అవోపా స్వంత భవన నిర్మాణపు కలను సాకారం చేస్తామని, అవోపా హబ్సిగూడా అభివృద్ధికి అలుపెరుగక తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేసారు.  గౌరవ సభ్యులు తమ తమ సందేశాలు నొసంగారు.  రాజేంద్రప్రసాద్ గారు గౌరవ వందనం తెలియజేశారు. అల్పాహార విందుతో కార్యక్రమము ముగిసింది. 









కామెంట్‌లు