శ్రధ్ధాంజలి

 

తేదీ 6.12.2021  బుధవారం రోజున ఆర్టీసిక్రాస్రోడ్స్ లోని ఆవోపా హైదరాబాద్ కార్యాలయంలో రోశయ్య గారి సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు రోశయ్యగారికి ఘనంగా నివాళులు అర్పించారు.  నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో ఆర్థిక శాఖ భవనానికి రోశయ్య గారి పేరు పెట్టాలని, ఆయన జీవితచరిత్రను పాట్యామ్శంగా చేర్చి పిల్లలకు బోధించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18సార్లు ఆర్థికమంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాజకీయ దురంధరుడు, అందరికి ఆత్మీయుడు, మాజీ సిఎం కొణిజేటి రోశయ్య పేరిటన నగరంలోని నెక్లెస్రోడ్లో స్మారక ఉద్యానవనాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య అఫీషి యల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషణ్ (అవోపా) హైదరాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. ఓంనమశ్శివాయ, ప్రధాన కార్యదర్శి ఎం. రవిగుప్త, కోశాధికారి మాకం బద్రీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. పై అన్ని అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సిఎం కెసిఆర్కు పంపింఛామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రోశయ్య ఎంతో ఆత్మీయుడని, అందరి ఆదరాభిమానాలు చూరగొన్నాడని, ఆర్యవైశ్యులకు వారు చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. వైశ్య సంఘాలకు ప్రాధాన్యత వహిస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ సంఘాలను ముందుకు నడిపించారన్నారు. ఈ కార్యక్రమంలో అవోపా హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులతో బాటు సలహాదారు మారం లక్ష్మయ్య సభ్యులు హరినాథ్, బిజాల రమేశ్, ఐవి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు