న్యాయవాదులను సన్మానించిన అవోపా కరీంనగర్

 

న్యాయవాదుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్థానిక వైశ్య భవనం లో కరీంనగర్ జిల్లా ఆర్య వైశ్య ఆఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (అవొపా ) ఆధ్వర్యంలో న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అవొపా అధ్యక్షులు పీవీ రామకృష్ణ మాట్లాడుతూ న్యాయవాద వృత్తి పవిత్రమైనదని, ఈరోజు న్యాయవాదులను సన్మానించుకోవడం ఎంతో ఆనందం గా ఉన్నదని తెలిపారు. సీనియర్ న్యాయవాదులు పి. గోపాల కిషన్, గంజి స్వరాజ్ బాబు, కొత్త ప్రకాశ్, పీవీ రామకృష్ణ, బొడ్ల శ్రీనివాస్, గీత రాణి లను శాలువా లతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో అవొపా ప్రధాన కార్యదర్శి కొండూరు శ్రీనివాస్, వెంకటేశం, దశరథం, ఈశ్వర్ ప్రసాద్, చామ మహేష్, రాజేశం, రవీందర్, గాంధీ, సుధాకర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు