అవోపా ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవము

 


     జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాల  పెద్ద ముద్దునూరు లో  పోలీస్ అమరవీరుల  సంస్మరణ  దినోత్సవ సందర్భంగా  విద్యార్థులకు  వ్యాసరచన పోటీలు అవోపా నాగర్ కర్నూల్ అధ్వర్యంలో  నిర్వహించబడ్డాయి.  తరగతి వారీగా విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ  బహుమతులు  అందజేయ బడ్డాయి.

  ఈ సందర్భంగా  పాఠశాల ప్రధానోపాధ్యాయులు  అవోపా జిల్లా ఉపాధ్యక్షులు  శ్రీ దర్శి రాజయ్య గారు మాట్లాడుతూ  సమాజ శ్రేయస్సుకు  పోలీసులు  నిరంతరము  పాటు పడుతున్నారని ప్రజల  భద్రతకు  పోలీసులు  తమ ప్రాణాలను  సైతము  అర్పిస్తున్నారు అని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు నాగర్ కర్నూలు అవోపా జిల్లా ఉపాధ్యక్షులు  కందూరు బాలరాజు ఉపాధ్యాయులు  హరి ప్రసాద్ మోహన్ ఆచారి జహంగీర్ భీమ్ అమ్మ  విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు 

            విద్యార్థులకు  బహుమతులను అందజేసిన దాత  అవోపా ప్రతినిధి  మదన్ శెట్టి శ్రీనివాసులు( గౌతమ్ ఇంజనీరింగ్) కూతురు స్వాతి 

           ఈ కార్యక్రమాన్ని  ఈ పాఠశాలలో  నిర్వహించినందుకు  అవోపా అధ్యక్షులు  రాఘవేందర్ గారికి   అదేవిధంగా  తన పుట్టిన రోజు సందర్భంగా  వ్యాసరచన పోటీ  విజేతలకు  బహుమతులు అందజేసిన  స్వాతి గారికి  ఉపాధ్యాయులు  ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ది శంకర్ నాగర్ కర్నూల్ అవొపా అధ్యక్షులు రాఘవేందర్ వారి కార్యవర్గాన్ని అభినందించారు.

కామెంట్‌లు