జూమ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వారితో అధ్యక్షుని సంభాషణ

 


తేదీ 13.10.2021 రోజున తెలంగాణా రాష్ట్ర అవోపా అధ్యక్షులు శ్రీ మలిపెద్ది శంకర్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా అవోపా ప్రముఖులతో జూం మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో పరిచయం చేసుకున్నారు.

తదుపరి తన కాలపరిమితి 2 సంవత్సరాల లో చేపట్ట బోయే కార్యక్రమాల గురించి వివరిస్తూ రెండు సంవత్సరాలు పూర్తి అయిన అవోపాల జిల్లా, యూనిట్ సంఘ భాద్యులు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా సభ్యత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని కాబట్టి ప్రతి యూనిట్ లో యున్న సభ్యులు ఒక్కొక్కరి నుండి 500.00 చొప్పున  మరియు నూత సభ్యులను నమోదు చేయుచూ సబ్యత్వ రుసుము వసూలు చేసి రాష్ట్ర అవోపాకు జమచేయాలని కోరారు.

సభ్యులుగా చేరిన వారికి మల్టీ కలర్ ఐడి కార్డు పంపడం జరుగుతుందని తెలిపారు.

జమ అయిన మొత్తం డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీ నుంచి 50 శాతం యూనిట్లకు పంపిస్తామని తెలిపినారు.

మెంబర్ షిప్ ప్రక్రియ త్వరలో ముగించుకుని అన్ని యూనిట్, జిల్లా లకు నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన అనంతరం జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి క్యాలండర్ ఆఫ్ ఈవెంట్ ప్రకారం  రాష్ట్రం అంతటా కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జనవరి ఒకటో తేదీన అందమైన అవోపా నూతన డైరీ ప్రతి సభ్యుని చేతిలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపినారు. 

త్వరలోనే అందరి సహకారంతో ఆర్యవైశ్య మహాసభ కు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమి లో ఒక ఎకరం భూమి అవోపాకు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు.

అలాగే యాదాద్రి నగర్ లో ఉన్న 300 గజాల స్థలం లో  గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలిపినారు.

కార్యవర్గ  సమావేశాలకు హాజరు కానిచో వారిని తొలగించి కొత్త వారిని నియమిస్తామని తెలిపినారు.

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారంలొ అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 28 గురు ప్రతినిధులు హాజరై తమ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర అధ్యక్షులు తో పాటు ప్రధాన కార్యదర్శి పోలా శ్రీధర్, నిజాం వెంకటేశం, కందికొండ శ్రీనివాస్, ప్రొఫెసర్ కే.రమణయ్య, పెద్ది ఆంజనేయులు, మడుగూరి నాగేశ్వరరావు, డాక్టర్ కిరణ్, వి.అనిల్, జి.ప్రమోద్, గుడాల  కృష్ణమూర్తి, మల్యాల వీరమల్లయ్య, డాక్టర్ రావికంటి శరత్, మచ్చ సోమయ్య, ఎల్లెంకి రవీందర్, కె. ప్రకాశం, యంవి అప్పారావు, సతీష్,  తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు