తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షునిగా నియమింప బడిన శ్రీ కలకొండ సూర్యనారాయణ గారికి మరియు కార్యదర్శి గా నియమింపబడిన శ్రీ కొండూరు రాజయ్య గారలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తేలియజేయు చున్నవి.
శ్రీ కలకొండ సూర్యనారాయణ గారు గతంలో టౌన్ అవోపా ఈసీ మెంబర్ గా, కార్యద ర్శిగా, జిల్లా అవోపా అధ్యక్షుడిగా రెండు సార్లు, రాష్ట్ర అవోపా కార్యదర్శిగా పనిచేశారు. రెండో సారి రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడిగా నియామక మయ్యారు.
శ్రీ కొండూరు రాజయ్య గారు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు జిల్లా టి.ఎన్.జి.ఓ యూనియన్ లో కోశాధికారిగా, వాణిజ్య పన్నుల శాఖ యూనియన్ లో ఉపాధ్యక్షునిగా, అవోపాలలో గత 20 సంవత్సరాలు వివిధ పదవులలో కొనసాగుతూ రాష్ట్ర అవోపాలో కార్యదర్శిగా రెండవ సారి పని చేయుటకు ఎంపిక కాబడినారు. వీరికి మహబూబ్నగర్ జిల్లా అవోపాలతో మంచి సంబంధాలు కలవు. వీరు జిల్లా అవోపాలో పని చేశారు. సలహా దారునిగా కూడా సేవ లందించారు. వీరల ఎంపికల పై రాష్ట్ర అపా చీఫ్ కోఆర్డినేటర్ కండె కుమారస్వామి, జిల్లా అవోపా అధ్యక్షులు కంది శ్రీనివాసు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి